లక్ అంటే ఆమెదే. ఆమె హ్యాండ్ తగిలితే చాలు హిట్టే మరి. అందానికి అందంతో పాటు అభినయాన్ని కూడా జత చేసి హిట్టు మీద హిట్టు కొడుతున్న ఆమె అచ్చంగా బుట్టబొమ్మే. టాలీవుడ్ లో ఆమెకు ఫ్యాన్ మెయిల్ చాలానే ఉంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆమె కోసం క్యూ కట్టేవారు చాలా మంది ఉండడమే విశేషం. ఆమె పూజా హెగ్డే.

పూజా హెగ్డే తనది లక్కీ హ్యాండ్ అని మరో సారి రుజువు చేసుకుంది. ఆమె అఖిల్ కి అయిదవ సినిమాతో హిట్ ఇచ్చి తాను కూడా వరసగా అయిదవ హిట్ కొట్టింది. ఆ మూవీయే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. ఈ మూవీ దసరాకు రిలీజ్ అయి బ్రేక్ ఈవెన్ కి చాలా దగ్గరగా ఉంది. మొత్తానికి దసరాకు నాలుగు సినిమలౌ రిలీజ్ అయితే నంబర్ వన్ మూవీగా బ్యాచలర్ నిలవడం వెనక పూజా గ్లామర్ కూడా ఉందని అంటున్నారు. పూజా తెలుగులో వరసగా హిట్లు కొడుతున్నారు. దీంతో ఆమెకు ఖాతాలో మరో విజయమని చెబుతున్నారు.

ఇంతకీ సంతోషం ఏంటి అంటే అక్కినేని వారబ్బాయి అఖిల్ కి ఇది ఫస్ట్ హిట్. గత  సినిమాలు మనసు పెట్టి చేసినా కూడా అఖిల్ కి సరైన విజయం దక్కలేదు. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని అఖిల్ కసి మీద పని చేశాడు. ఇక ఈ మూవీలో పూజా హీరోయిన్ కావడమే ఒక స్పెషల్. ఆమె అప్పటికే టాప్ హీరోల పక్కన నటిస్తోంది. అలాంటి ఆమె అఖిల్ కి జత కావడమే ఈ సినిమా విజయంలో కీలకం అంటున్నారు. పూజాతో జోడీ కడితే సక్సెస్ అన్న మాటను కూడా అలా నిలబెట్టుకున్నట్లు అయింది.

ఇవన్నీ ఇలా ఉంటే పూజా ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటిదాకా కొంత కలవరంగా ఉన్న్నారు. దానికి కారణం మూవీ బాగా లేట్ కావడం, పీరియాడికల్ లవ్ స్టోరీ అంటూ ఎవేవో కధనాలు వినిపించడం. అయితే బ్యాచలర్ మూవీ తరువాత వారిలో ఒక్కసారిగా ఆనందం రెట్టింపు అవుతోందిట. పూజా పెర్ఫెక్ట్ గా లవ్ స్టోరీస్ కి సూట్ అవుతుంది. ప్రభాస్ తో ఆమె ఫస్ట్ టైమ్ చేసినా హిట్ గ్యారంటీ అంటున్నారుట. ఈ దెబ్బతో పూజాకు డబుల్ హ్యాట్రిక్ ష్యూర్ అని కూడా జోస్యం చెబుతున్నారుట. సో పూజా లక్కీయెస్ట్ హీరోయిన్ అని చెప్పాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: