బొమ్మరిల్లు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన భాస్కర్ మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సాధించారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించి తెలుగు ప్రేక్షకులు అందరినీ మంత్రముగ్ధులను చేశాడు.. అప్పట్లో ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ విజయాన్ని సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న భాస్కర్ ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త లాంటి సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయారు.



 అయితే ఎన్నో ఏళ్ల తర్వాత ఇక ఇటీవలే అసలైన హిట్ అందుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఇటీవలే అక్కినేని హీరో అఖిల్ తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా తెరకెక్కించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఎన్నో రోజుల నుంచి సరైన హిట్ కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్న అఖిల్ కు ఎట్టకేలకు హిట్ దక్కింది అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ ఛార్మ్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే అఖిల్ కు సూపర్ హిట్ అందించడంలో కీలక పాత్ర వహించింది. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం అటు బొమ్మరిల్లు భాస్కర్  ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఈ సినిమా కి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం నెలకు రెండు లక్షల రూపాయలు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి జీతం ఇచ్చారట అల్లు అరవింద్. ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్లు కేటాయించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ లెక్కన చూసుకుంటే దాదాపు 60 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు లెక్క. ఇక అదే సమయంలో సినిమా హిట్టయితే షేర్ నుంచి 40 లక్షలు ఇస్తామని నిర్మాతలు తెలిపారట. కాగా ఈ సినిమా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలై బ్రేక్ ఈవెన్ పాయింట్ ను కూడా సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: