తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు నటీ నటులు ఎంతో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి మెప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అఘోర పాత్రల్లో కనిపించి గుర్తించిన వారు కూడా ఉన్నారు. అలా అగోరా పాత్రల్లో కనిపించి మెప్పించిన నటీ నటుల గురించి మనం తెలుసుకుందాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నందమూరి నట సింహం బాలకృష్ణ అగోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా ఈ టీజర్ కు జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత కూడా తెలుగులో పాలక్ నమ దాస్, హిట్, పగల్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విశ్వక్ సేన్ కూడా గామీ అనే సినిమాలో అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే గామీ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్రబృందం బయటకు వదలగా దీనికి జనాల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి కెరీయర్ లో ఎన్నో డిఫరెంట్ పాత్రలో కనిపించి జనాలను మెప్పించాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి హీరోగా నటించిన శ్రీ మంజునాథ సినిమాలో కొన్ని నిమిషాలపాటు అగోరా పాత్రల్లో కనిపించి జనాలను ఎంతగానో మెప్పించాడు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరో గా తెరకెక్కిన డమరుకం సినిమాలో అక్కినేని నాగార్జున కొన్ని నిమిషాలపాటు అగోరా పాత్రల్లో కనిపించి అభిమానులను అలరించాడు.

నాగబాబు కూడా అఘోరా అనే సినిమాలో అగోరా గా కనిపించి మెప్పించాడు.

మంచు మనోజ్ కూడా అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో అఘోర పాత్రలో కనిపించబోతునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: