సినిమా ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్ ..అలాంటి సినిమాలకు పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. కొన్ని సార్లు సినిమాలలో కంటెంట్ లేకున్నా కేవలం పాటల వలనే హిట్ అయిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికల పడ్డ పాటలు మాత్రం సూపర్ హిట్ అయిన సందర్బాలు ఉన్నాయి. సినిమాలు సక్సెస్ కావాలంటే కంటెంట్ తో పాటు సాంగ్స్ కూడా అదిరిపోయేలా ఉంటేనే ఊహించిన ఫలితాలు వస్తాయి. పాటలకు అంత ప్రాధాన్యం ఉంది. ప్రేక్షకుల దృష్టిని తమ సినిమా వైపుకు ఆకర్షించాలి అంటే హీరో, హీరోయిన్ లతో పాటు పాటలు కూడా చాలా ముఖ్యం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

కొన్ని పాటలు ప్రేక్షకుల్ని ఎంతగా కనిపిస్తాయి అంటే దశాబ్దాలు మారుతున్న ఆ పాటల సందడి మాత్రం అలాగే కొనసాగుతుంది. మ్యూజిక్ లవర్స్ తమ ఫేవరెట్ సాంగ్స్ ని ఏళ్లు గడుస్తున్నా అంతే ఫ్రెష్ గా ఎంజాయ్ చేస్తుంటారు. అందులోనూ ఊపొచ్చే పాటలంటే ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తుంటారు. మంచి బీట్, హుషారు పెంచే లిరిక్స్ ఆహా అనిపించే మ్యూజిక్ ఉండాలే కానీ ఎక్కడ విన్న ఇక ఆ పాటలే వినిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో టైటిల్ సాంగ్ విషయంలో ప్రత్యేక దృష్టి ని పెడుతున్నారు మేకర్స్. వీలైనంత వరకు అన్ని సినిమాలలోనూ టైటిల్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే దాదాపుగా ఇలా వచ్చే అన్ని పాటలు కూడా  మంచి ఆదరణను పొందుతున్నాయి.

అలాంటి పాటలలో "దేకో దేకో  గబ్బర్ సింగ్"..గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న గబ్బర్ సింగ్ చిత్రంలో అన్ని పాటలు విజయవంతం అయ్యాయి. ప్రతి పాట ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక టైటిల్ సాంగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. రికార్డులు బద్దలు కొట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమాకి టైటిల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికీ అందరూ ఈ పాటను ఆలపిస్తూ ఊగుతూ డాన్స్ చేస్తుంటారు. కొందరైతే పాట వినిపిస్తే చాలు తెలియకుండానే పాంట్ పట్టుకుని స్తెప్పులేసేస్తారు... ఈ పాట వింటే ఊపు రావాల్సిందే మరి..ముఖ్యంగా మ్యూజిక్ బాగా హైలెట్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: