బుల్లి తెర పై చాలా షోల‌కు యాంక‌ర్ గా చేసే మాచిరాజ్ ప్ర‌దీప్ 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమా తో వెండి తెర కు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా కు ముందు చాలా సినిమా ప్ర‌దీప్ న‌టించాడు. కానీ కామెడీయ‌న్ గానీ, హీరో స్నేహితుని పాత్ర‌లో గాని క‌నిపించాడు. అయితే హీరోగా మాత్రం ఈ సినిమా లో మొద‌టి సారి కెమెరా ముందు కు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉన్న స‌మ‌యంలో నే ఈ సినిమా నుంచి ఒక లిరిక‌ల్ పాట‌ను విడుద‌ల చేశారు. ఆ పాట అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తే అనేక రికార్డు ల‌ను త‌న ఖాత లో వెసుకుంది. ఆ పాటే నీలి నీలి ఆకాశం ఇద్దామ‌ను కున్న‌..



ఈ పాట విడుద‌ల అయిన నాటి నుంచి అంద‌రి నోట ఇదే పాట వ‌చ్చేది. ఈ పాట విడుద‌ల అవ‌డంతో 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమా కు అంచ‌నాలు ఒకే సారి అమాంతం పెరిగి పోయాయి. ఈ పాట ను కొన్ని రోజుల త‌ర్వాత ఇత‌ర భాష ల‌లో కి అనువాదం చేశారు. అక్క‌డ కూడా ఈ పాట సెన్సేష‌న‌ల్ హిట్ అయింది. అయితే ఈ పాట‌కు లిరిక్స్ ను ప్ర‌ముఖ ర‌చయిత చంద్ర బోస్ అందించాడు. అలాగే సంగీతాన్ని అనుప్ రూబెన్స్ అందించాడు. అయితే ఈ పాట కు ఎంతో ముఖ్య మైన గాత్రాన్ని సిద్ శ్రీ‌రామ్ అందించాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బెస్ట్ పాట ల‌లో నీలి నీలి ఆకాశం ఒక‌టి కూడా ఉంది. ఈ పాట యూట్యూబ్ లో కూడా సెన్సేష‌న్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ పాట ను యూట్యూబ్ లో 272 మిలియ‌న్ ల మంది చూశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: