ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న అగ్రతారలు కేవలం సినిమాలు మాత్రమే చేయడం లేదు..సినిమాలతో పాటు తమ సంపాదనను పెంచుకోవడానికి వివిధ రకాల బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రెటీలు ఎన్నో రకాల బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఆ బ్రాండ్స్ జనాలకు హాని కలిగించేవి కాకపోతే ఇబ్బందులేమీ ఉండవు కానీ.. ప్రజలకు నష్టం కలిగించేవి అయితే మాత్రం వాటిపై పెద్ద పెద్ద వివాదాలు చెలరేగుతుంటాయి.ఇది కేవలం స్టార్ హీరోల విషయాల్లో మాత్రమే కాదు హీరోయిన్ల విషయంలో కూడా జరుగుతూ వస్తున్నాయి.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు కూడా వివిధ రకాల బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా కూడా ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అయితే దానిపై నెటిజన్లు పెద్దఎత్తున ఫైర్ అవుతున్నారు. దానికి కారణం ఏంటనే విషయానికొస్తే.. తన సోషల్ మీడియాలో రెజీనా..' తనకు తొమ్మిదేళ్ళ వయసు ఉన్నప్పుడే యాంకరింగ్ ప్రారంభించాలని.. ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తారని ఈ సంతోషాన్ని సిగ్నేచర్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని..

సిగ్నేచర్ బ్రాండ్ కు చెందిన ఆల్కహాల్ కు ఈమె బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరిగింది. దీంతో దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. కేవలం డబ్బు కోసమే ఇలాంటి హానికరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారంటూ నెటిజన్లు ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే తన పద్ధతి బాగా లేదని.. డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా రెజీనా చేసిన పోస్ట్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తుండటం గమనార్హం. ఏదేమైనా ఒకప్పుడు హీరోయిన్గా మంచి సినిమాలు చేసిన రెజీనా..ఇలా ఒక ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించడం అనేది ఆమె అభిమానులకు అస్సలు నచ్చడం లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: