తెలుగు సినిమాలలో ఐటెం పాటలకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలలో ఐటెం పాటలు పెట్టి మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చే విధంగా ప్రణాళికలు వేస్తారు. ఆ విధంగా ప్రతి ఒక పెద్ద హీరో సినిమాలో కూడా ఐటమ్ సాంగ్స్ ఉండే విధంగా సినిమాలను ప్లాన్ చేసుకుంటారు. ఈ ఐటెం పాట బాగా ఉంటే తప్పకుండా ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే ఆలోచనతో ఈ విధమైన ప్రయోగాలు చేయడానికి దర్శక నిర్మాతలు సహకరిస్తున్నారు. 

ఐటెం పాటలు పెట్టే పద్ధతి టాలీవుడ్ సినిమా వారు ఎప్పటి నుంచో ఆచరిస్తున్నారు. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓ ఐటెం సాంగ్ సినిమా సూపర్ హిట్ కావడానికి ఎంతగానో దోహద పడింది. అదే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని కెవ్వు కేక అనే పాట. మలైకా అరోరా ఐటమ్ గర్ల్ గా నటించిన ఈ పాట ఎంత పెద్ద సూపర్ హిట్ అయింది అంటే ఇప్పటికి ఆ పాట మార్మోగిపోతూ ఉంటుంది. ప్రేక్షకుల ప్రతి ఒక్కరి ప్లే లిస్టులో ఈ పాట ఉండిపోతుంది. 

నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ప్రేక్షకులు పూనకం వచ్చినట్లు ఆ సినిమాను చూడటానికి వస్తారు. అందులోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంది అంటే ఇక చెప్పనవసరం లేదు. ఒక్కసారి కాదు ఈ పాట కోసం చాలా సార్లు గబ్బర్ సింగ్ సినిమాను ప్రేక్షకులు చూశారు అంటే ఈ పాట అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తో ఉండే దేవిశ్రీ ప్రసాద్సినిమా కి వెరీ స్పెషల్ సంగీతం అందిస్తున్నాడు.  ఆ విధంగా గబ్బర్ సింగ్ సినిమాకి వేరే రేంజ్ లో సంగీతాన్ని అందించి మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచేలా చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: