ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ఘన విజయం అందుకున్నాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన తెలుగులో చాలా రోజుల తర్వాత సినిమా అవకాశాన్ని దక్కించుకుని ఇప్పుడు ఆ చిత్రాన్ని సూపర్ హిట్ అయ్యేలా చేయడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పవచ్చు. రామ్ చరణ్ హీరోగా చేసిన ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవడంతో ఒక్కసారిగా బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం ఆయన కెరియర్ పై బాగానే ఎఫెక్ట్ చూపించింది. 

దాంతో ఆయన తమిళనాట సినిమాలు చేసుకోవడం మొదలు పెట్టాడు. అక్కడ కూడా ఆయన చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో ఒక మంచి కథ రాసుకోవాలి అని చెప్పి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమా పై చాలా శ్రమించి దాని సినిమా గా మొదలు పెట్టాడు ఆ విధంగా ఈ సినిమా అక్కినేని అఖిల్ తో చేయగా ఇప్పుడు సూపర్ హిట్ ఇద్దరికీ వచ్చేలా చేశాడు. ఇటు తాను మంచి కం బ్యాక్ చేయడంతో పాటు తన హీరో అఖిల్ కి కూడా తొలి హిట్ వచ్చేలా చేసుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్.

అయితే తెలుగులో ఐదు సంవత్సరాలుగా సినిమాలు చేయక పోయినా అంతకుముందు భారీ ఫ్లాపులు ఉన్న సరైన విజయం లేక పోయినా కూడా బొమ్మరిల్లు భాస్కర్ పారితోషకం విషయంలో ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది. ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికం ఈ సినిమాకి తీసుకుని మేటర్ ఉంటే ఎంతైనా డిమాండ్ చేయవచ్చు అనే విషయాన్ని మరొక సారి చాటి చెప్పాడు భాస్కర్. ఇక తమ తదుపరి సినిమాను మల్టీస్టారర్ చిత్రంగా చేయబోతున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. మరి ఈ సినిమాతో సంచలన రికార్డులు సృష్టిస్తున్న ఈ దర్శకుడు భవిష్యత్తులో ఎలాంటి సినిమాలను చేసి రికార్డుల మీద రికార్డులు సాధిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: