టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి పేరుతో పాటు స్టార్డమ్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఆయన సినిమాల ఎంపికనే ఆయన సినిమాల పట్ల ఎంత ఆసక్తిగా ఎంత జాగ్రత్తగా ఉంటాడో తెలియజేస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలలో దాదాపు 80 శాతం సక్సెస్ రేట్ ఉన్న నిర్మాత దిల్ రాజు అనే చెప్పాలి. టాలీవుడ్ పరిశ్రమలోని అందరు హీరోలతో సినిమాలు చేసి మంచి నిర్మాతగా ఆయన పేరు సంపాదించుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాడు దిల్ రాజు. 

ఆ విధంగా దిల్ రాజు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా లను తెరకెక్కిస్తు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందే విధంగా ఆయన సినిమాలను చేస్తున్నాడు. తమిళ హీరోలతో సైతం ఆయన వరుసగా సినిమాలు తీస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు. అంతే కాదు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఆశ్చర్యపోయేలా తెలుగు భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఆయన నిర్మాతగా జెర్సీ సినిమా రీమేక్ అదే పేరు తో బాలీవుడ్ లో తెరకెక్కుతోంది.

ఇకపోతే దిల్ రాజు అన్న కొడుకు హీరోగా రౌడీ బాయ్స్ చిత్రం తెరకెక్కగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధి గా రాగా ఆయనను దిల్ రాజు పవర్ స్టార్ ను చేసే విధంగా కనిపిస్తున్నాడు.  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా పవన్ కళ్యాణ్ ను ప్లేస్ భర్తీ చేసే అవకాశం విజయ్ దేవరకొండ 100 శాతం ఉందని చెప్పవచ్చు.  ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ రాబోయే చిత్రాలతో విజయం సాధించి ఏ విధంగా పవన్ ను భర్తీ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: