దసరా సందర్భంగా అక్కినేని
అఖిల్ హీరోగా తెరకెక్కిన
సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్
సినిమా విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గత మూడు సినిమాలుగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న
అఖిల్ నాలుగో
సినిమా తో భారీ హిట్ ను సొంతం చేసుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా
బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది ఈ సినిమా.
తొలి రోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ
సినిమా వసూళ్లు కూడా
అఖిల్ కెరీర్లో ఎన్నడూ లేని భారీ వసూళ్లను సాధిస్తుంది.
దసరా సందర్భంగా విడుదలైన ఇతర సినిమాలు కూడా
అఖిల్ దెబ్బకు మటాష్ అయిపోయాయని చెప్పవచ్చు. ఏదేమైనా ఈ
సినిమా ఫలితం అక్కినేని కాంపౌండ్ కు భారీ హిట్టును సంపాదించి పెట్టి అందరినీ ఫుల్
జోష్ లో ఉండేలా చేసిందని చెప్పవచ్చు.
పూజా హెగ్డే పాత్ర ఈ సినిమాలో హైలైట్ కాగా అక్కినేని
అఖిల్ నటన తన గత సినిమాల కంటే మెరుగ్గా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి.
చూడబోతే ఈ వారం కూడా ఈ అక్కినేని కుర్రాడిదే హవా ఉండబోతున్నట్లూ గా తెలుస్తుంది. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు పెద్దగా లేకపోవడంతో ఈ సినిమాలు కొంత భారీ వసూళ్లను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ వారం నాట్యం అలాగే
మధుర వైన్స్ అనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకులకు పెద్దగా క్రేజ్ లేకపోవడంతో ఫ్యామిలీ
ఆడియన్స్ అలాగే యూత్ ఫుల్
ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతే కాకుండా
మహా సముద్రం
సినిమా కూడా ఫ్లాప్ కావడం ఈ చిత్రం ఇంత పెద్ద ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణం.