తెలుగులో చాలా సినిమాలకి ఒక్క పాటతో క్రేజ్ వచ్చిన సందర్భలు చాలా చూసాం. అలానే ఆర్ ఎక్స్ 100 సినిమాలో పిల్ల రా పాట వల్ల ఆ సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. దూరమైన హీరోయిన్ కోసం హీరో పాడే ఈ పాట అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఉపేసింది. చాలామంది యువత ఈ పాటని కాలర్ ట్యూన్ గా పెట్టుకొని ఆనందపడేవాళ్ళు. అలాగే ఈ పాటకి యూట్యూబ్ లో కూడా వందల మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.

యూట్యూబ్ ఛానల్స్ లో ఈపాటకి ఏకంగా 250 మిలియన్స్ వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ పాట సినిమాకి ఎక్కడలేని ప్రమోషన్ ని తెచిపెట్టింది. ఆర్ ఎక్స్ 100 సినిమా అంతా పెద్ద హిట్ అవ్వడానికి ఈ పాట కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. డైరెక్టర్ అజయ్ భూపతి ఈ పాటని చూపించిన విధానం కూడా చాలా ఆకట్టుకుంటుంది. తను ఎంతో ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో పిచ్చోడైన హీరో బాధతో పాడే పాట ఇది. లవ్ ఫెయిల్యూర్ పాట అవ్వడం వల్లనే ఈ పాట అంతలా జనాలల్లోకి వెళ్ళింది.  

చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి అందంగా ఆలపించారు. చైతన్ భారత్వజ్  సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అన్ని చాలా బాగుంటాయి. ఇక ఈ సినిమా తర్వాత చైతన్ భారత్వజ్ కి తెలుగులో వరసగా చాలా ఆఫర్స్ వచ్చాయి. అందులో ఆయనకి పెద్ద ఆఫర్ అంటే అక్కినేని నాగార్జున మన్మథుడు 2 సినిమానే అని చెప్పాలి. ఈ సినిమాలో పాటలు అన్ని చేతన్ చాలా బాగా ఇచ్చారు. ఇక ఈ మద్యనే వచ్చిన అజయ్ భూపతి మహా సముద్రం సినిమాకి చేతన్ ఇచ్చిన పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: