ఈ మ‌ధ్య కాలంలో స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటుంది. ముఖ్యంగా నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత  ప్ర‌తీ విష‌యాన్ని త‌న అభిమానులతో సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎద‌ర్కొంటూ.. ట్రోల‌ర్ల‌పై  స‌మంత న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మైంది. తాను నాగ‌చైత‌న్య తీసుకుంటున్న విడాకుల‌పై అన‌వ‌స‌రంగా త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని.. రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌తో పాటు  డాక్ట‌ర్ వెంక‌ట్‌రావుపై ప‌రువున‌ష్టం దావా వేశారు స‌మంత‌. ఈ పిటీష‌న్‌ను కూక‌ట్‌ప‌ల్లి కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది.  ఆ కోర్టులో స‌మంత‌కు షాక్ త‌గిలింది.

స‌మంత త‌రుపున వాదించిన న్యాయవాదిపై న్యాయ‌మూర్తి చిన్న‌పాటి క్లాస్ తీసుకున్నాడు. ప‌రువు న‌ష్టం దావా వ్య‌వ‌హారంలో స‌మంత‌కు చేదు అనుభ‌వ‌మే ఎదురైంద‌ని చెప్పాలి. అక్కినేని వారసుడు నాగ‌చైత‌న్య‌తో విడాకులకు సంబంధించిన వ్య‌వ‌హారాన్ని యూట్యూట్ చాన‌ళ్లు, డాక్ట‌ర్ వెంక‌ట్‌రావు త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని స‌మంత కోర్టుకు వెళ్లిన విష‌యం విధిత‌మే. అయితే స‌మంత వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు, వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగేలా అబద్ధాల‌ను ప్ర‌చారం చేసిన చాన‌ళ్ల‌పై, వ్య‌క్తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిటీష‌న్‌లో కోరింది.  కూక‌ట్‌ప‌ల్లి కోర్టు పిటీష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించింది.

అత్య‌వ‌స‌రంగా విచారించ‌డం కుద‌ర‌ద‌ని కోర్టు వెల్ల‌డించింది. సినీ న‌టి స‌మంత బిజీగా ఉంటారు కాబ‌ట్టి ఆమె కేసును కోర్టు ఎమ‌ర్జెన్సీగా విచారించాల‌ని  ఆమె త‌రుపు న్యాయ‌వాది బాలాజీ కోరారు. ఇందుకు జడ్జీ స్పందించి సామాన్యులైనా సెలబ్రిటీలు అయినా న్యాయస్థానం ముందు ఒక్కటే అని.. ఆమె త‌రుపు న్యాయ‌వాది బాలాజీ చెప్పిన కార‌ణాల‌తో విభేదించారు. కోర్టులో, చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే. కొంద‌రు త‌క్కువ‌, కొంద‌రు ఎక్కువ అనే భావ‌న అస‌లు ఉండ‌దు. స‌మంత కేసును ప్రొసీజ‌ర్ ప్ర‌కారం విచారిస్తాం. అన్ని ప‌రువు న‌ష్టం దావా కేసులు ఏ విధంగా విచారిస్తామో.. ఈ కేసు కూడ అదే విధంగా విచారిస్తాం అని జ‌డ్జీ చెప్పాడు. అత్య‌వ‌స‌ర కేసు కింద తీసుకోబోమ‌ని జ‌డ్జీ వెల్ల‌డించారు. దీంతో స‌మంత‌కు షాక్ త‌గిలిన‌ట్ట‌యింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: