ఐటెం సాంగ్స్ అంటే సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. పాటల్లో ఆ పదాల సందడి, ఆ జోష్ , హుషారు, ఊపు తెప్పించే మ్యూజిక్ ఇవన్నీ ఐటెం సాంగ్ ప్రత్యేకతలే. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి మంచి డాన్సర్ లను, అందమైన అందగత్తెలను స్పెషల్ గా తీసుకొచ్చే వారు. ఒక్కసారి వారి సాంగ్ హిట్ అయిందంటే చాలు ఇక స్పెషల్ సాంగ్ అంటే చాలు వరుసగా చాలా చిత్రాలలో వారే కనిపించేవారు. అప్పట్లో జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, డిస్కో శాంతి వంటి వారంతా ఐటెం సాంగ్స్ తో హిట్ అందుకుని వరుస అవకాశాలతో పాపులారిటీ పెంచుకున్న వారే. అప్పట్లో ఐటెం సాంగ్ అంటే చాలు వీరే కనిపించే వారు. కానీ ఇపుడు ట్రెండ్ మారింది, స్టార్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఐటెం సాంగ్స్ చేస్తే వాటికే పరిమితమౌతారని, హీరోయిన్స్ గా ఛాన్స్ లు తగ్గుతాయి అని అనుకునే రోజుల నుండి స్పెషల్ సాంగ్స్ చేస్తే క్రేజ్ డబుల్ అవుతుంది అనే స్థాయికి ట్రెండ్ మారింది. ఇప్పటికే  టాలీవుడ్ అగ్ర కదానాయికలు కాజల్ అగర్వాల్, తమన్నా, పూజ హెగ్డే వంటి వారు స్పెషల్ సాంగ్స్ లో మెరిసి మరింత పాపులర్ అయ్యారు. అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ఇలా స్టార్ హీరోయిన్లు చేసిన ఎన్నో ఐటెం సాంగ్స్ సినిమాకి హైలెట్ గా మారాయి. అలాంటి వాటిలో రంగస్థలం సినిమాలో "జిల్ జిల్ జిగేలు రాణి" పాట కూడా ఒకటి. రామ్ చరణ్ తేజ్, సమంత ప్రధాన పాత్రల్లో వచ్చిన రంగస్థలం మూవీ బంపర్ హిట్ కాగా ఈ చిత్రంలో జిగేలు రాణి పాట సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఏ మూల చూసినా ఎక్కడ విన్నా అందరి నోట ఇదే సాంగ్ ఇప్పటికీ అంతే ఆదరణను పొందుతోంది.

ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఇకపోతే ఈ సాంగ్ లో వినిపించిన ఫిమేల్ వాయిస్ ఏ స్టార్ సింగర్ దో అనుకుంటే పొరపాటే మరి. ఈ పాటను పాడింది విశాఖపట్నం జిల్లా లోని, అనకాపల్లిలో చిల్లర కొట్టుతో జీవనం సాగించే మహిళ గంటా వెంకటలక్ష్మి. ఈ సినిమాలో ఈ పాట నిజంగా జిగేలు మనిపించి అందరినీ స్టెప్పులు వేయించింది. ది బెస్ట్ టాలీవుడ్ స్పెషల్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటి ఒక పాట రావడం అది సూపర్ సక్సెస్ కావడం అంటే చిన్న విషయం ఏమి కాదు. ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రంలో జిగేల్ రాణి సాంగ్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: