నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత  ప్ర‌తీ విష‌యాన్ని త‌న అభిమానులతో సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్న‌ది స‌మంత‌. తాజాగా నాగ‌చైత‌న్యతో విడాకులు తీసుకోక‌ముందే మూడు యూట్యూబ్ చాన‌ళ్లు త‌ప్పుడు ప్ర‌చారం చేశాయ‌ని.. యూట్యూబ్ చాన‌ళ్ల‌పై,  డాక్ట‌ర్ వెంక‌ట్‌రావుపై స‌మంత‌ ప‌రువున‌ష్టం దావా వేశారు. కూక‌ట్‌ప‌ల్లి కోర్టు విచార‌ణ‌కు గురువారం స్వీక‌రించింది.  

స‌మంత త‌రుపున వాదించిన లాయ‌ర్‌పై జ‌డ్జీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే. కొంద‌రు ఎక్కువ‌, కొంద‌రు త‌క్కువ అని ఉండ‌దు.  ఈకేసును ప్రొసిజ‌ర్ ప్ర‌కారం విచారిస్తాం. మిగ‌తా ప‌రువు న‌ష్టం దావా కేసుల లాగానే ఇరువురి వాద‌న‌లు వింటాం. అత్య‌వ‌స‌ర కేసుగా స్వీక‌రించం. కోర్టు చివ‌రి స‌మ‌యంలో విచారిస్తాం అని చెప్పారు. అక్కినేని వారసుడు నాగ‌చైత‌న్య‌తో విడాకులకు సంబంధించిన వ్య‌వ‌హారాన్ని యూట్యూట్ చాన‌ళ్లు, డాక్ట‌ర్ వెంక‌ట్‌రావు త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని స‌మంత కోర్టుకు వెళ్లిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. స‌మంత ప్ర‌తిష్టను దెబ్బ‌తీసిన మూడు యూట్యూబ్ చాన‌ళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స‌మంత త‌రుపు లాయ‌ర్ బాలాజీ జ‌డ్జీని కోరారు. త‌ప్పు జ‌రిగిన‌ట్టు భావిస్తే ప‌రువు న‌ష్టం దాఖ‌లు చేసే బ‌దులు వారి నుంచి క్ష‌మాప‌ణ కోర‌వ‌చ్చు క‌దా అని కోర్టు ప్ర‌శ్నించింది. సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త వివ‌రాలు ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారే.. ప‌రువుకు భంగం క‌లిగింద‌నేది వారే క‌దా అని కోర్టు పేర్కొన్న‌ది.

దీనిపై స‌మంత ఇంకా విడాకులు తీసుకోలేదని, విడాకులు తీసుకోక ముందే ఆమెపై దుష్ప్ర‌చారం చేయ‌డం నేర‌మ‌ని న్యాయ‌వాది బాలాజీ కోర్టుకు వివ‌రించారు. అదేవిధంగా స‌మంత‌ను కావాల‌నే వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి వార్త‌లు రాయ‌డం, యూట్యూబ్‌లో వీడియోలు పెట్ట‌డం.. ఆమెకు అక్ర‌మ సంబంధాలు అంట‌గ‌ట్ట‌డం వంటివి చేశార‌ని వివ‌రించారు. భ‌విష్య‌త్‌లో ఇలాంటి వార్త‌లు రాయ‌కుండా, వీడియోలు పోస్ట్ చేయ‌కుండా క‌ఠినమైన శిక్ష విధించేలా తీర్పు ఇవ్వాల‌ని న్యాయ‌వాది కోరారు.  గురువారం సాయంత్రం వ‌ర‌కు తీర్పు వ‌స్తుంద‌ని అంద‌రూ ఎదురుచూశారు. కానీ కూక‌ట్‌ప‌ల్లి కోర్టు రేప‌టికి వాయిదా వేసింది. దీంతో స‌మంత కాస్త నిరాశ‌కు గురైంది. కోర్టులో స‌మంత వేసిన పిటిష‌న్‌పై తీర్పు ఏవిధంగా ఉంటుందోన‌ని చాలా మంది ఎదురుచూశారు. శుక్ర‌వారానికి వాయిదా వేయ‌డంతో తీర్పు స‌మంత‌కు అనుకూలంగా ఉంటుందా లేక ఉండ‌దా అని చ‌ర్చించుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: