బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పూజ హెగ్డే అఖిల్ కి లక్కీ హీరోయిన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ హీరోయిన్ తో వరుస చిత్రాలు చేయండి బాస్ అంటూ చాలా మంది అడుగుతున్నారట. దాంతో ఫ్యాన్స్ కోసం అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ లో కూడా పూజ హెగ్డే ని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ వెండి తెరపై అఖిల్, పూజ ల జోడీ మాత్రం నిజంగా మ్యాజిక్ చేసింది.
మరో సారి ఆ మ్యాజిక్ ను ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు తెగ ఆసక్తిగా ఉన్న తరుణంలో వీరి కాంబో లో నెక్స్ట్ మూవీ వస్తోంది ఏమో చూడాలి. అయితే సాధారణంగా తమకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ లతో సినిమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి త్వరలోనే వీరి నుండి మరో సినిమా ఆశించవచ్చు...