నేచురల్ స్టార్ నాని కొన్నాళ్ళ వరకు మినుమమ్ గ్యారెంటీ హీరో. వరసగా 7 సక్సస్ లు నానీకి రావడంతో నాని మార్కెట్ పెరగడమే కాకుండా టాప్ హీరోల రేంజ్ కి నాని ఎదిగిపోతాడా అన్న అంచనాలు వచ్చాయి. దీనికితోడు అతడి ఓవర్ సీస్ మార్కెట్ కూడ బాగా పెరిగింది..అయితే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాసు’ ‘గ్యాంగ్ లీడర్’ కోవిడ్ రాకముందు వరస ఫ్లాప్ లు.  


ఆతరువాత కోవిడ్ సమయంలో ఓటీటీ లలో రిలీజ్ అయిన ‘వి’ ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులకు కూడ పూర్తిగా నచ్చకపోవడం షాక్ ఇచ్చే విషయం. దీనితో నాని తన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాని ‘పుష్ప’ మ్యానియాను లెక్క చేయకుండా డిసెంబర్ 24న విడుదల చేస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


డిసెంబర్ 17న రిలీజ్ కాబోతున్న ‘పుష్ప’ ‘బాహుబలి’ రేంజ్ లో కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ విషయాలను పట్టించుకోకుండా నాని ఏ ధైర్యంతో  తన సినిమాను ‘పుష్ప’ విడుదలైన కేవలం ఒక్క వారం గ్యాప్ లో విడుదల చేస్తున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నాని కెరియర్ కు అత్యంత కీలకమైన ఈమూవీ ఫలితంలో ఏమైనా తేడాలు వస్తే నాని పరిస్థితి ఏమిటి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


డిసెంబర్ రెండవ వారం నుండి టాలీవుడ్ లో పెద్ద సినిమాల హవా మొదలవ్వుతూ ఉండటంతో ‘పుష్ప’ తో మొదలైన భారీ సినిమాల హడావిడి జనవరిలో వచ్చే ‘ఆర్ ఆర్ ఆర్’ తో క్లైమాక్స్ కు చేరబోతోంది. ఇన్ని భారీ సినిమాల తుఫాన్ ల మధ్య నాని సినిమాకు చోటు ఉంది అనుకోవడం ఒక విధంగా నాని మితిమీరిన ఆత్మ విశ్వాసం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  




మరింత సమాచారం తెలుసుకోండి: