నందమూరి తారక రామారావు హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా చేసిన మోహన్ బాబు పాలిటిక్స్ వల్ల తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మోహన్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ శ్రీరాములయ్య సినిమా చేసిన సమయంలో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. రాజకీయ ప్రత్యర్థుల ఈ కారణంగానే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు వార్తలు వచ్చాయి.

హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో 'శ్రీరాములయ్య' సినిమా ప్రారంభోత్సవానికి వందలాది మంది తరలి వెళ్లారు. ఆ సమయంలోనే మోహన్ బాబు అక్కడ ఉండగానే కారు లో బాంబు బ్లాస్ట్ జరిగింది. గ్లాస్ తో భూమిలో 6 అడుగుల వెడల్పు రెండు అడుగుల లోతు తో ఒక గుంట ఏర్పడింది. చుట్టూ వందల అడుగుల వరకూ వీధులు ఇళ్ళల్లో బ్లాస్ట్ ఎఫెక్ట్ ఏర్పడింది. ఆ కార్ లో ప్రయాణిస్తున్న ఆరుగురు జర్నలిస్టులు ముక్కలు ముక్కలు అయిపోయారు. కారు ఆ బాంబు బ్లాస్ట్ వల్ల గాల్లోకి ఎగిరి కింద పడింది. సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన జర్నలిస్టులలో 23 మంది అక్కడికక్కడే మరణించారు. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో చాలామంది కాళ్ళు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ భారీ పేలుడు కు పరిటాల రవి కారణమని అనుమానించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఏదేమైనా మోహన్ బాబు తృటిలో ఇంటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇలా రాజకీయ పగ మోహన్ బాబు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అప్పటి వాళ్లకు ఈ విషయం బాగా తెలిసినప్పటికీ ఈ తరం యూత్ కు చాలా మందికి ఈ సంఘటనపై పెద్దగా అవగాహన లేదు.

ఎన్టీఆర్ మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేశాడు.ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం లేదు. కానీ ఇటీవల మంచు కుటుంబం మొత్తం మోడీని కలవడంతో ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: