మురళీమోహన్ 1940 జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా లోని చాటపర్రు అనే గ్రామంలో జన్మించిన విషయం తెలిసిందే.. వీరు ఫ్యామిలీ స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ.. ఇక వీరి తండ్రిగారు మాగంటి మాధవరావు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గా గుర్తింపు పొందారు.. ఇక ఈయన విద్యాభ్యాసం ఏలూరులో పూర్తి చేసిన తరువాత ఉద్యోగం చేయాలన్న ఆలోచనతో సొంతంగా 1963వ సంవత్సరంలో ఎలక్ట్రికల్ మోటార్ అలాగే ఆయిల్ ఇంజన్ వ్యాపారం ప్రారంభించారు.. ఈ వ్యాపారం ఒకవైపు నడిపిస్తూనే మరోవైపు నాటకాలలో నటించడం కూడా మొదలుపెట్టారు.

ఈ సమయంలోనే విజయలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకోవడం , వీరికి మధు బిందు, రామ్ మోహన్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇక నాటకాలలో ఈయన నటనను మెచ్చిన తోటి స్నేహితులు సినిమాలలో ప్రయత్నం చేయమని ప్రోత్సహించ గా.. 1973 అట్లూరి పూర్ణచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగమేమాయ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. అయితే ఇక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు..కానీ దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1974 లో వచ్చిన తిరుపతి అనే సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. తమ్ముడు కిషోర్ తో కలిసి జయభేరి అనే ఒక నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసి , దాని ద్వారా మొత్తం 25 చిత్రాలను నిర్మించారు..


నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వివిధ విభాగాలలో సేవలు కూడా అందించారు.. 2015లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇక ఈయన రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. టీడీపీ పార్టీలో చేరి.. 2009వ సంవత్సరంలో 15వ లోకసభ ఎన్నికలలో ఈయన రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఆపోజిట్ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఏకంగా 2,147 ఓట్ల తేడాతో పరాజయం పొందారు.. 2014లో 16వ లోక్ సభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రిలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. నేటికి రాజకీయ నాయకుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: