బాబు మోహన్.. ఒక గొప్ప హాస్యనటుడిగా, ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాబుమోహన్. కేవలం నటుడు మాత్రమే కాదు రాజకీయ వేత్త కూడా. రాజకీయవేత్తగా తన జీవితాన్ని మొదలు పెట్టిన తరువాత పదవిని చేజిక్కించుకొని ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.. అంతే కాదు ఎంతో మందికి ఎప్పటికప్పుడు అండగా నిలిచే బాబు మోహన్ రాజకీయ అనుభవం గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం.


బాబు మోహన్ తన చిన్నప్పటి వయస్సు నుంచి అన్న ఎన్టీఆర్ ను చూస్తూ పెరిగారు.. ఆయనకు వీరాభిమానిగా మారారు.. ఇక సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న బాబు మోహన్ ఆ తర్వాత అన్న గారి ప్రోత్సాహంతో టిడిపిలోకి చేరారు.. ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేకపోయినప్పటికీ ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలన్న తపన ఆయన రాజకీయాల్లోకి తీసుకు వచ్చేలా చేసింది.  ఇక ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే టిడిపి పార్టీలోకి చేరారు బాబు మోహన్..

1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం నుంచి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి,  శాసనసభ  సభ్యులుగా ఎన్నికైన మోహన్ బాబు సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా కూడా  పనిచేశాడు. కానీ నీ చంద్రబాబు నాయుడు తో విభేదాలు రావడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. ఆ తర్వాత 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహను  టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం పొందాడు. ఇక ఇక టిఆర్ఎస్ లో కూడా ఉండలేక తిరిగి బిజెపిలోకి చేరిపోయారు . 2019 లో బీజేపీ లో చేరి ఆందోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటి చేసి పరాజయం పొందాడు..


ఆయనకు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది కాబట్టే మొన్న మా ఎన్నికల లో మంచు విష్ణుకి మద్దతు ఇచ్చి , రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాలు పన్నితే విజయం సాధిస్తారో తెలిపి మంచు విష్ణు అధ్యక్షుడి పదవి చేపట్టేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: