2021 సంవత్సరం అక్కినేని వారికి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. కరోనా నేపథ్యంలో అక్కినేని వారసుల సినిమాలు గత సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతూ రాగా 2021 వ సంవత్సరంలో నెల రోజుల వ్యవధిలోనే ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ చిత్రాన్ని సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగా 20 రోజుల వ్యవధిలోనే అక్కినేని అఖిల్ తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ను దసరా సందర్భంగా థియేటర్లలో విడుదల చేశాడు.

అయితే ఈ రెండు సినిమాలు కూడా విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని అత్యధిక వసూళ్లు రాబట్టిన మిగిలిపోయాయి అని చెప్పవచ్చు. గత మూడు సినిమాలు గా హిట్ లేక సతమతమవుతున్న అక్కినేని అఖిల్ నాలుగో సినిమా తో  సూపర్ హిట్ కొట్టడమే కాకుండా నటుడిగా కూడా ఆయనకు మంచి ప్రశంసలు వచ్చే సినిమా గా మిగిలిపోయింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఆమె పాత్ర ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు.

అయితే ఇద్దరి కొడుకుల సక్సెస్ ను తన సక్సెస్ గా భావించి అక్కినేని నాగార్జున దాన్ని ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర బృందానికి పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది నాగార్జున. గీతా ఆర్ట్స్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి పార్టీ ఇవ్వాలని ఆయన డిసైడ్ అయ్యాడట.  కొడుకు కి తొలి విజయాన్ని అందించిన సంస్థ గీతా ఆర్ట్స్ సంస్థ కాబట్టి ఆ సంస్థలో తాను కూడా సినిమాల్లో చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: