రెబ‌ల్ స్టార్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చు కున్న కృష్ణం రాజ్ రాజ‌కీయాల్లో నూ త‌న దైన ముద్ర వేశాడు. న‌టుడిగా మంచి గుర్తింపు తో పాటు ప‌లు అవార్డు ల‌ను కూడా సొంతం చేసుకున్నాడు. త‌న కేరీర్ లో ఉత్త‌మ న‌టుడు, నంది అవార్డు, సౌత్ కు సంబంధించి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ల‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తెలుగు లో తన సినిమా ల ప్ర‌భావం తో చాలా మంది అభిమానుల‌ను సంపాధించాడు. దీంతో రాజ‌కీయాల్లోకి వెళ్లి ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని ఉద్ధేశంతో రాజ‌కీయాల‌కు ద‌గ్గ‌ర అయ్యాడు. దీంతో రాజ‌కీయాల్లో అడుగు పెట్టి అందులో క్రియా శీల‌క పాత్ర ను పోషించ‌డు. సినిమా రంగం లో తో పాటు రాజ‌కీయ రంగం లోనూ ఉన్న‌త స్థానానికి కూడా వెళ్లాడు.



కృష్ణం రాజ్ 1990 లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశాడు. అయితే 1991 లో న‌ర్సాపూరం పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గం నుంచి ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. కానీ ఈ పోటీలో టీడీపీ అభ్య‌ర్థి చేతిలో ప‌రాజ‌యం పాలు అయ్యాడు. దీంతో కొంత కాలం పాటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాడు. కానీ 1998 లో భార‌తీయా జ‌న‌తా పార్టీ ఆహ్వానించ‌డంతో ఆ పార్టీ లో చేరాడు. అదే సంవ‌త్స‌రంలో కాకినాడ పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గం నుంచి ఎంపీ పోటీ చేసి విజ‌యం సాధించాడు. మ‌ళ్లి ఏడాది త‌ర్వాత అంటే 1999 లో  న‌ర్సాపూరం పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లలో బీజేపీ నుంచి పోటీ చేశాడు. అయితే ఈ ఎన్నిక‌ల్లో కృష్ణం రాజ్ భారీ మెజార్టీ తో విజ‌యం సాధించాడు.



ఈ సమ‌యంలో నే కేంద్ర స‌హాయ మంత్రి గా కూడా చేశాడు. దీంతో ప‌లు శాఖ ల కూడా కేంద్ర‌ స‌హాయ గా చేశాడు. దీని త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి 2009 స్టాంపిచిన ప్రజారాజ్యం పార్టీ లో చేరాడు. దీంతో 2009 లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి ఎంపీ గా పోటీ చేశాడు. అయితే ఇందులో ప‌రాజ‌యం పాలు అయ్యాడు. అప్ప‌టి నుంచి రాజ‌కీయాలకు కొంచం దూరంగా ఉంటున్న ప్ర‌స్తుతం కూడా బీజేపీ లో కొన‌సాగుతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: