రెబల్ స్టార్ కృష్ణం రాజ్ రాజ‌కీయాల్లో భార‌తీయ జ‌నతా పార్టీ కే అధిక ప్రాధాన్య‌త ఇస్తాడు. తాను రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన నాటి నుంచి ఎక్కువ శాతం బీజేపీ లోనే కొన‌సాగారు. ఆ పార్టీ నుంచి రెండు సార్లు ఎంపీ గా కూడా విజ‌యం సాధించారు. మొట్ట మొద‌టి సారి 1998 లో కాకినాడ పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గం నుంచి ఎంపీ గా పోటీ చేసి విజ‌యం సాధించాడు. రెండో సారి 1999లో న‌ర్సాపూరం నుంచి ఎంపీ గా పోటీ చేసి దాదాపు 165000 ఓట్ల తేడాతో భారీ విక్ట‌రీ సాధించాడు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాక కృష్ణం రాజ్ రాజ‌కీయ భ‌విష్యత్తు మారిపోయింది.



ముందుగా 1999 వ సంవ‌త్స‌రంలో పార్ల‌మెంటు నుంచి ఆర్థిక సంఘం లో స‌భ్యుడిగా ఎన్నిక‌య్యాడు. అలాగే ప్రాంతియ అభివృద్ధి క‌మిటి లో కూడా స‌భ్యుడు అయ్యాడు. దీని త‌ర్వాత 2000 సంవ‌త్స‌రంలో వాణిజ్య‌, పరిశ్ర‌మల శాఖ త‌ర‌పున సంప్ర‌దింపుల క‌మిటీ లో స‌భ్యుడు అయ్యాడు. అలాగే ఇదే సంవ‌త్స‌రంలో విదేశి వ్య‌వ‌హారాల శాఖ నుంచి స‌హాయ మంత్రి గా చేశాడు. దీని త‌ర్వాత ఏడాది లో ర‌క్ష‌ణ శాఖ విభాగంలో స‌హాయా మంత్రి గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. దీని త‌ర్వాత 2002 లో వినియోగ‌దారుల శాఖ విభాగంలో కూడా స‌హాయ మంత్రిగా ప‌ద‌వి ని చేప‌ట్టాడు.



అయితే భార‌తీయ జ‌నతా పార్టీ ఇంతలా సేవ‌లు అందించిన  కృష్ణం రాజ్ కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్న‌ట్టు వార్తలు వ‌చ్చాయి. కానీ బీజేపీ అధికారంలోకి వ‌చ్చి చాలా సంవ‌త్స‌రాలు అవుతున్న ఇంకా కృష్ణం రాజ్ కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్క‌లేదు. అయితే భ‌విష్య‌త్తు లో రెబ‌ల్ స్టార్ కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయ‌ని తెలుస్తుంది. ఇది నిజం అవుతే కృఫ్ణం రాజ్ క‌ష్టానికి బీజేపీ ఫ‌లితం ఇచ్చేన‌ట్టే అవుతుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: