దాస‌రి నారాయ‌ణ రావు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియ‌ని వారు ఉండ‌రు. ఆయ‌న తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎది చెబుతే అదే వేదం లా ఉండేది. ఆయన ఉన్నంత కాలంలో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ కు పెద్ద‌న్న పాత్ర పోషించాడు. టాలీవుడ్ లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసు కోవాల‌న్న ఆయ‌న్ని సంప్ర‌దించ కుండా చేసేవారు కాదు. అంత‌టి గౌర‌వం ఆయ‌న‌కే సొంతం అన‌డం లో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఇలాంటి పెద్దరికాన్ని రాజ‌కీయ రంగంలోనూ దాస‌రి చాటు కున్నాడు. అంతే కాకుండా అప్ప‌టి ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కూడా దాస‌రి త‌న దైన ముద్ర వేశాడు. త‌న పెద్ద‌రికం అటు రాజ‌కీయాల్లో ఇటు సినిమా రంగంలో దాస‌రి కంఠం లో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు కొన‌సాగింది.



దాస‌రి నారాయ‌ణ రావు రాజ‌కీయ ప్ర‌స్థానం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ లోనే కొన‌సాగింది. ఆ పార్టీ కి చివ‌రి వ‌ర‌కు సేవ‌లు అందిస్తూ వ‌చ్చారు. కానీ చిరంజీవి స్థాపించిన ప్ర‌జా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన నాటి నుంచి ఆ పార్టీ కి కాస్త దూరంగా ఉంటు వ‌చ్చారు. అయితే ముఖ్యం గా 2004 లో కాంగ్రెస్ అధికారంలో కి వ‌చ్చిన నాటి నుంచి రాజ‌కీయాల్లో చురుకు గా పాల్గొన్నాడు. అంతే కాకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విశ్వాస పాత్రుడిగా ఉండే వాడు. ఫలితంగా దాస‌రి ని కాంగ్రెస్ పార్టీ రాజ్య స‌భ లోకి పంపించింది. అలాగే కేంద్ర బొగ్గు శాఖ లో స‌హాయ మంత్రి ప‌ద‌వి ని కూడా క‌ట్ట‌బెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కి ప్ర‌జ‌ల‌కు ఎన్నో సేవ‌లు అందించారు. అయితే తాను కొన్ని రాజ‌కీయంగా కొన్ని వివాద‌స్ప‌ద అంశాల్లోనూ చిక్కు కున్నాడు. తాను 2004 లో బొగ్గు శాఖ లో స‌హాయ మంత్రి గా ఉన్న స‌మ‌యంలో ప‌లు ఆరోప‌ణలు ఎదుర్కొన్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: