దివంగత నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి హరి కృష్ణ రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు. ఈయన నటుడిగా కంటే ప్రజలకు సేవ చేయడంలోనే ఎక్కువ సంతృప్తిని పొందేవారట. అందుకే ఆయన అవకాశం ఉన్నా పెద్దగా సినిమాలలో కనిపించేవారు కాదు . రాజకీయంలోకి అడుపెట్టిన ఈయన ప్రజా సేవలో సమయం సరిపోక ఎన్నో చిత్రాలను కూడా వదులుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతుంటారు. నందమూరి తారక రామారావు వారసుడిగా మూడో కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన అనతికాలంలోనే రాజకీయం వైపు అడుగులు వేశారు . సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ వంటి చిత్రాలతో కీర్తి ప్రతిష్టలు పెంచుకున్నారు.

కొన్నాళ్ళకి తండ్రి రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో సినిమాలను తగ్గించి ఎక్కువ సమయం పాలిటిక్స్ లో తండ్రి వెంటే ఉండేవారు. ఒకానొక సమయంలో తండ్రికి వ్యతిరేకంగా మారి చంద్రబాబుకు మద్దతు పలికిన సందర్బాలు ఉన్నాయి. 1995 లో చంద్రన్న నాయకత్వంలో హరికృష్ణ రవాణా శాఖ కి సంబందించిన బాధ్యతలను అప్పగించారు. కానీ కొన్ని కారణాల వలన ఆ పదవిని వదులుకున్నారు. 1996 లో ఎన్టీఆర్ మరణించడంతో హిందూపురం లోని అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. అప్పట్లో పోటీలో నిలిచి గెలిచి  ఆ పదవిని అందుకున్నారు హరి కృష్ణ. ఒక సందర్భంలో నారా చంద్రబాబు నాయుడితో విభేదాలు తలెత్తడంతో అన్న తెలుగుదేశం అనే పేరుతో కొత్త పార్టీని ఆవిష్కరించారు హరికృష్ణ.

కానీ ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఆదరణకు నోచుకోక పోవడంతో తిరిగి టిడిపిలో చేరారు. అలా ఆయన రాజకీయ జీవన ప్రయాణం ఎన్నో కీలక మలుపులు తిప్పింది. శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా,  రాజ్య సభ సభ్యుడిగా ఆయన ఆంధ్ర ప్రజలకు సేవ చేశారు.  2018 ఆగస్ట్ 29 న తన స్నేహితుల ఇంటిలో పెళ్లి కోసం వెళుతుండగా నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అవడంతో ప్రాణాలు కోల్పోయారు.  చివరి రోజుల్లోనూ టీడీపీ బ్యూరో సభ్యుడిగా సేవలను అందించారు హరి కృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: