ఆనాడు అన్న తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో...రాజకీయాల్లో సినీ తారల స్పీడు పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో నటీనటులు కూడా భాగం అవుతూ రాజకీయ జీవితానికి కొత్త రంగులు తీసుకొస్తున్నారు. అయితే కేవలం సినిమాలలో నటులుగా మంచి గుర్తింపు ఉంటే రాజకీయాల్లోనూ దూసుకుపోవచ్చు అనుకుంటే పొరపాటే..
నాటి నుండి నేటి వరకు ఎందరో సినీ సెలబ్రిటీలు పాలిటిక్స్ లోకి అడుగు పెట్టినా అందరికీ అనుకున్న ఫలితం అందలేదు. కొందరు వెను తిరగగా కొందరు మాత్రమే ఇక్కడ నిలదొక్కుకోగలిగారు. అలాంటి వారిలో నటి జయసుధ కూడా ఒకరు. సినీ రంగంలో తన భర్త డైరెక్ట్ చేసిన చిత్రాలు వరుస ఫ్లాపులు అవడంతో కష్టాలు పాలయిన ఈమె పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయారని అప్పట్లో చాలా వార్తలే వినిపించాయి.

అలాంటి సమయంలో దివంగత రాజకీయ నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయసుధను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. అలా 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి తొలుత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరవాత కొన్నాళ్ళకి టిడిపిలోకి చేరారు. వాస్తవానికి జయసుధకు నిరంతరం ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఈమె మెతక స్వభావం గల వ్యక్తి అందుకే రాజకీయాల్లో పెద్దగా ప్రాధాన్యం పొందలేకపోతున్నారు అని ఓ వర్గం చెబుతున్న మాట. మళ్ళీ ఇపుడు ఈమె వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు.

అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు వైద్య సేవలు అందించడానికి ఇటీవల ఒక ట్రస్ట్ ను కూడా ప్రారంభించి సేవలు అందిస్తున్నారు. కాగా ఒక సినీనటిగా ఈమె గురించి అందరికీ తెలిసిందే. అందరి అగ్ర నటులతోనూ నటించి మంచి పేరును తెచ్చుకుంది. ఇపుడు కూడా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు చేస్తూ జీవితాన్ని గడుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: