తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, కమెడియన్ గా, సహృదయుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యాక్టర్ వివేక్. తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన అన్ని సినిమాలలో కూడా రజనీకాంత్ స్నేహితుడు పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్.. నిజ జీవితంలో కూడా రజనీకాంత్ కు వీరాభిమాని.. తమిళనాడు రాష్ట్రం మొత్తం మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈయన ఇదే సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే.. ఇక ఈయన మరణ వార్త విన్న సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.


అయితే 2021 ఏప్రిల్ 16వ తేదీన వివేక్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ మరుసటి రోజు మరణం చెందడంతో పలు మీడియా వర్గాలు  కోవిడ్ వ్యాక్సిన్ వికటించి వివేక్ మరణించాడు అని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.. ఆస్పత్రి వర్గాలు.. వ్యాక్సిన్ వల్ల చనిపోలేదని చెప్పినప్పటికీ మీడియా మాత్రం వ్యాక్సిన్ వల్లే వివేక్ చనిపోయాడని స్పష్టం చేశారు.. వివేక్ మరణం విషయంలో నిజానిజాలు గుట్టు తేల్చడానికి విల్లుపురం కు చెందిన సామాజిక కార్యకర్త అయిన ఎన్. ఎస్.శరవణన్ పూనుకున్నారు.

అంతేకాదు వివేక్ మరణానికి అసలైన కారణం ఏంటో తెలియజేయాలని ఆయన ఎన్ హెచ్ ఆర్ సీ లో కూడా ఫిర్యాదు చేశారు. శరవణన్ ఫిర్యాదు మేరకు ఎన్ హెచ్ ఆర్ సి ఈ ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కి కూడా పంపించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ శాఖ వీరి ఫిర్యాదులను పరిశీలించి.. తాజాగా వివేక్ ఎలా చనిపోయాడు..అందుకు గల కారణాలేంటి అన్ని విషయాలను తెలియజేస్తూ ఒక నివేదికను విడుదల చేసింది..

వివేక్ అధిక రక్తపోటు, గుండెపోటు కారణంగా మరణించారని ఆయన చనిపోవడానికి వ్యాక్సిన్ కు ఎటువంటి సంబంధం లేదని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: