బొమ్మరిల్లు మూవీతో సూపర్ సక్సెస్ కొట్టిన భాస్కర్ కి అదే ఇంటి పేరు అయింది. ఎంతో క్యూట్ గా ఆ మూవీలో లవ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని పండించిన భాస్కర్ టాలీవుడ్ లో పది కాలాల పాటు కొనసాగుతారు అని అంతా భావించారు. అయితే విధి విచిత్రం భాస్కర్ తరువాత మెగా హీరో రామ్ చరణ్ తో తీసిన ఆరెంజ్ మూవీ ఘోరమైన ఫ్లాప్ మూటకట్టుకోవడంతో ఇక భాస్కర్ పని అయిపోయింది అన్న వారే ఎక్కువ అయ్యారు. దానికి తగినట్లుగా ఆయనకు అవకాశాలు కూడా రాకుండా పోయాయి.
అయితే మొత్తానికి భాస్కర్ సుదీర్ఘకాలం పాటు తెర వెనక ఉండిపోయారు. ఇక ఆయన మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తారా అన్న చర్చ కూడా సాగింది. ఈ టైమ్ లో భాస్కర్ నిజంగా ఇంబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొన్నాడు. అలాంటి భాస్కర్ కి గీతా ఆర్ట్స్ బ్యానర్ పిలిచి అవకాశం ఇవ్వడం, అది కూడా అక్కినేని వారి హీరోతో మూవీ చేయడం, పూజా హెగ్డే హీరోయిన్ కావడం, ఇవన్నీ కలసి వచ్చే అంశాలే అయ్యాయి. మొత్తం మీద చూసుకుంటే రెండున్నరేళ్ల భాస్కర్ కష్టం ఫలించింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో భాస్కర్ కి కూడా మంచి అవకాశం మళ్లీ వచ్చింది. గీతా ఆర్ట్స్ వారే మరో మూవీ కోసం కధన్ రెడీ చేసుకోమని తాజాగా చెప్పారని టాక్. మొత్తానికి భాస్కర్ జాతకాన్ని బ్యాచలర్ మార్చేశాడు అంటున్నారు.