ప్రభాస్ ఇప్పుడు సౌత్ ఇండియన్ హీరోగా మంచి పేరు పొందాడు. ఇక ఈయన కటౌట్ కి సౌత్ ఇండియా మొత్తం ఫిదా అయిపోయింది. బాహుబలి సిరీస్ తో ఇండియన్ సినిమాకి ఫేస్ అయిపోయాడు ప్రభాస్. అయితే ప్రభాస్ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.


ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఇది ప్రభాస్ అసలు పేరు. ప్రభాస్ తండ్రి కూడా ఒక సినీ నిర్మాత. ఇక ప్రభాస్ చదువు భీమవరంలోని D.N.R. స్కూలు లో చదువుకున్నాడు. తన గ్రాడ్యుయేషన్ నీ శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ లొ పూర్తి చేశాడు. ఆ తర్వాత 2002 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. ఈశ్వర్ సినిమాతో యావరేజ్ గా సరిపెట్టుకున్నాడు ప్రభాస్.


ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయావు ఇప్పుడు. ప్రభాస్ 2004లో సంతోష్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇక ఇవే కాకుండా ఉత్తమ నటుడిగా కూడా ఎన్నో అవార్డులు పొందాడు ప్రభాస్. ప్రభాస్ అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా పేరుపొందాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకి.70 నుంచి 80 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.


కొన్ని మీడియా సంస్థలు తెలిపిన ప్రకారం ప్రభాస్ కు 215 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్లుగా సమాచారం. ప్రభాస్ తను సంపాదించే వాటిలో కొంతమేరకు అనాధ పిల్లల ఖర్చులకోసం చారిటీస్ కి డొనేట్ చేస్తూ ఉంటాడట. ప్రభాస్ హైదరాబాదులో 62 కోట్ల విలువ చేసే ఒక ఇల్లు ఉన్నట్లుగా సమాచారం. ప్రభాస్ చేసేటటువంటి జిమ్ము పరికరాల విలువ కోటిన్నర రూపాయలు ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ దగ్గర ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నవి. ప్రభాస్ దగ్గర 8 ఖరీదైన కార్లు ఉన్నవి. వాటి విలువ 20 కోట్ల పైగా ఉంది. ఇక ప్రభాస్ దగ్గర ఉన్న 5 టూ వీలర్స్ విషయానికి వస్తే వీటన్నిటితో ధర 70 లక్షలకు పైగానే ఉంటుంది. ఇదంతా ప్రభాస్ ఆస్తి విలువ.

మరింత సమాచారం తెలుసుకోండి: