ప్రభాస్..తెలుగు సినీ తెరకు పరిచయమైన ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా రేంజికి ఎదిగి మొత్తం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందే పనిలో ఉన్నాడు అని చెప్పవచ్చు.. సాధారణంగా ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే కేవలం పట్టుదల , స్వయంకృషి , అదృష్టం ఉంటే సరిపోదు.. పూర్వజన్మసుకృతం కూడా ఉండాలి అని అంటున్నారు జ్యోతిష్యులు.. పూర్వజన్మలో మనం చేసే పాప పుణ్యాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాము అంటూ తెలుపుతున్నారు.. ఈ రోజు మొత్తం దేశం మెచ్చే నటుడిగా ప్రభాస్ ఎదిగాడు అంటే అది కేవలం స్వయం కృషి, పట్టుదల ఉంటే సరిపోదు.. జాతకం కూడా అందుకు అనుకూలంగా ఉన్నప్పుడే ఆ రేంజ్ లో ఉన్నాడు అని చెబుతున్నారు.. అయితే ప్రభాస్ జాతకం గురించి జ్యోతిష్కులు ఏం చెబుతున్నారు అనే విషయాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం..


1979 అక్టోబర్ 10వ తేదీన ప్రభాస్ జన్మించారు. ప్రభాస్ జాతకం గురించి జ్యోతిష్కులు ఏం చెబుతున్నారంటే.. లగ్నం జాతకం గా చూసుకున్నట్లయితే అతి సామాన్యుడు జాతకం గా.. ఈ జాతకం ఉన్న వాళ్ళు ఇంత పొజిషన్ సాధించలేరు అన్నట్లుగా తెలిపారు. కానీ రవి లగ్నం నుంచి చూసుకున్నట్లయితే అద్భుతమైన జాతకమని జీవితంలో మరెన్నో సాధించగలిగే గొప్ప జాతకం అని చెబుతున్నారు.. అంతేకాదు అతి త్వరలోనే అంతర్జాతీయ నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకుంటాడు అని వారు చెప్పడం గమనార్హం.


ఒక  సినీ ఇండస్ట్రీలో గొప్ప నటులు గా గుర్తింపు పొందిన ఎంజీ రామచంద్రన్, నందమూరి తారక రామారావు, రజనీకాంత్ లాంటి గొప్ప స్టార్ హీరోల రేంజ్ కు ప్రభాస్ కూడా ఎదిగే అవకాశం ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.. భవిష్యత్ తరాల వాళ్లు కూడా ప్రభాస్ అంటే ఒక గొప్ప నటుడు అని గుర్తుండిపోయేలా తన జాతకం ఉందని వారు చెప్పడం గమనార్హం. ఈ విషయం విన్న ప్రభాస్ అభిమానులంతా ఆనందోత్సాహాలతో  సందడి చేసుకుంటున్నారు.రాబోయే రెండేళ్లలో అన్నీ కలిసొస్తే ప్రభాస్ వివాహం చేసుకుంటాడంటున్న జ్యోతిష్యుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: