పాన్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కొంతమంది ఆయన అభిమానులు ఈరోజు ప్రత్యేక పూజలు, అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు చేపడుతుంటే, మరోవైపు మేకర్స్ సినిమాల నుంచి అప్డేట్స్ రిలీజ్ చేయడానికి తయారు అవుతున్నారు.  ఇక ప్రభాస్ కోసం ఆయన అభిమానులు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఆ డై హార్డ్ ఫ్యాన్స్ పలు గిఫ్ట్ లు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు మాత్రం బహుమతిగా ఏకంగా 1.5 కోట్ల విలువైన జిమ్ ఎక్విప్మెంట్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. మరి వాటిని గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరు? ఎందుకు? అనే విషయాలు తెలుసుకుందాం.

బాహుబలి చిత్రం టాలీవుడ్ తలరాతనే తిరగ రాసింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టాలివుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేసింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా ను దర్శకుడు రాజమౌళి రూపొందించారు. ఆయన తండ్రి కేవీ విజయేంద్రప్రసాద్ కథను అందించారు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న శివుడు పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే దీని వెనుక చాలా కష్టంగా ఉంది. అనుకున్న షేప్ లో ప్రభాస్ ను చూడడానికి మేకర్స్ ఒకటిన్నర కోట్ల విలువైన జిమ్ ఎక్విప్మెంట్స్ ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ సమయంలో ప్రభాస్ లక్ష్మణ్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఆయన 2010 లో మిస్టర్ వరల్డ్ గా పేరు తెచ్చుకున్నారు. అలా బాహుబలి కోసం ప్రభాస్ పడిన కష్టం తెరపై ప్రతిఫలించింది. భారీ కండలతో, సిక్స్ ప్యాక్ తో అభిమానులు విజిల్స్ వేసేలా చేశాడు ప్రభాస్. ఆయన పడిన కష్టంకు తగినట్టుగానే ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు ప్రభాస్. ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎవరికి తెలియని ఈ విషయం ఆయన అభిమానుల కోసం.

మరింత సమాచారం తెలుసుకోండి: