ఇవాళ ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఆయ‌న అభిమానుల‌కు పండుగ రోజు. కెరియ‌ర్ ప‌రంగా దూసుకుపోతున్న హీరో ప్ర‌భాస్ త‌న కొత్త ప్రా జెక్టుల‌తో యావ‌త్ భార‌త‌దేశం దృష్టినీ ఆక‌ర్షిస్తున్నారు. ఇప్ప‌టికే ఆరు కొత్త ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. వీటిలో రాధేశ్యామ్ విడు దలకు సిద్ధం అవుతుండ‌గా, ఆదిపురుష్, స‌లార్, ప్రాజెక్టు కే, ప్ర‌భాస్ 24, స్పిరిట్ చిత్రాలు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. కొన్ని ప్రీ ప్రొడ క్షన్ వ‌ర్క్ కంప్లీట్ చేసుకోగా, మ‌రికొన్ని స్క్రిప్ట్ వ‌ర్క్ కు తుదిమెరుగులు దిద్దే ప‌నులలో ఉన్నాయి. ఇవ‌న్నీ క్రేజీ ప్రాజెక్టులే కావ‌డం విశేషం.

గుడ్ అండ్ బ్యాడ్ :  
ఇక ప్ర‌భాస్ కెరియ‌ర్ లో మంచి విజ‌యాలు న‌మోదు చేసిన చిత్రాలలో బాహుబ‌లి అగ్ర స్థానంలో నిల‌వ‌గా డిజాస్ట‌ర్ అనిపించుకు న్న చిత్రాలూ ఉన్నాయి. అయితే అవి క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎలా ఉన్నా అభిమానులు మాత్రం నిరాశ ప‌రిచాయి అని మాత్రం చెప్పుకో క త‌ప్ప‌దు. మొద‌టి సినిమా ఈశ్వ‌ర్ తో (జ‌యంత్ సి ప‌ర్జానీ ) ఎంట్రీ ఇచ్చారు. త‌రువాత రాఘ‌వేంద్ర లాంటి ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ ను సురేంద్ర కృష్ణ అనే త‌మిళియ‌న్ తో చేశారు. అసలు ప్ర‌భాస్ లాంఛ్ ను డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు చేయాల్సి ఉండ‌గా ఎందుక‌నో డెబ్యూ మూవీని జ‌యంత్ కు అప్ప‌గించారు. ఈశ్వ‌ర్ తో మంచి మార్కులే వేయించుకున్న ప్ర‌భాస్ త‌రువాత ఆయ‌న న‌టించిన రాఘ‌వేంద్ర  కూడా కాస్త యావ‌రేజ్ గా న‌డిచింది. వ‌ర్షంతో సూప‌ర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాకు వీరు పోట్ల అందించిన క‌థ, శోభ‌న్ ద‌ర్శ‌క‌త్వం, ప‌రుచూరి సోద‌రుల మాట‌లు, దేవీ శ్రీ సంగీతం ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. త‌రువాత బీ గోపాల్ ద‌ర్శ‌క‌త్వం లో చేసిన అడ‌వి రాముడు, కృష్ణ వంశీతో చేసిన చ‌క్రం కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా న‌టుడిగా కొంత పేరును అయితే తెచ్చి పెట్టాయి. వీటి త‌రువాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఛ‌త్ర‌ప‌తి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫ‌స్టాఫ్ స్థాయిలో సెకం డాఫ్ ను మ‌ల‌చ‌లేక‌పోయాడ‌న్న విమ‌ర్శ కూడా ఉంది.



మ‌ళ్లీ త‌న‌కు క‌లిసి వ‌చ్చిన సుమంత్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ నే  న‌మ్ముకుని ఎంఎస్ రాజు నిర్మాణ సారథ్యంలో, ప్ర‌భుదేవా డైరెక్ష‌న్ లో పౌర్ణ‌మి చేశాడు. కానీ ఈ సినిమా నిర్మాత‌కూ హీరోకూ  పెద్ద పేరు తీసు కురాలేక‌పోయింది. డ‌బ్బులూ పోయాయి అన్న బాధ ఇప్ప‌టికీ ఉంది ఎంఎస్ రాజులో! అటుపై మున్నా (వంశీ  పైడిప‌ల్లి) లాంటి స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కు ఓకే చేసినా ఫ‌లితం లేక‌పోయింది. దిల్ రాజు ఎంతో ఫ్యాష‌న్ తో చేసిన సినిమా ఇదే కావ‌డం విశే షం. మ‌న‌స్సా నువ్వుండే చోటే చెప్ప‌మ్మా పాట‌తో ఆ ఏడాది ఒక ఊపు ఊపింది ఆ పాట. కానీ సినిమా మాత్రం మంచి ఫ‌లితం అందుకోలేక‌పోయింది. అటుపై పూరీ జ‌గ‌న్నాథ్ బుజ్జి గాడు మేడిన్ చెన్నై చేశాడు. యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది కానీ డైలాగ్ డెలివ‌రీ ప‌రంగా ప్ర‌భాస్ కు ఊర మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. సొంత బ్యాన‌ర్ పై బిల్లా చేసినా, మ‌ళ్లీ పూరితోనే ఏక్  నిరంజన్ అంటూ ఉంగ‌రాల జుత్తు పిల్ల కంగ‌నా ర‌నౌత్ తో ఆడిపాడినా అవేవీ పేరు తీసుకు రాలేదు. ఆ త‌రువాత జ‌రిగిన ఎంపిక‌ల్లో భాగంగా ఈ సారి ల‌వ‌ర్ బోయ్ స్టోరీతో డార్లింగ్ సినిమా చేశాడు. తొలిప్రేమ ఫేం క‌రుణాక‌ర్ ఈ సినిమా కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.


పాట‌లు బాగున్నా పెద్ద‌గా టాక్ తెచ్చుకోలేక‌పోయింది. మ‌ళ్లీ దిల్ రాజు త‌న‌కు ఎంత‌గానో ఇష్టం అయిన కుటుంబ క‌థ‌నే ఎంచుకుని
మిస్ట‌ర్ పెర్ఫ‌క్ట్ (ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వం) చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దేవీ శ్రీ మ్యూజిక్ ఆయ‌న కెరియ‌ర్ కే హైలెట్. అటుపై లారెన్స్ తో రెబ‌ల్ చేసి ఘోర ప‌రాజ‌యం అందుకున్నాడు. ఆశ్చ‌ర్యం ఏంటంటే ఈ సినిమా హిందీ లో డ‌బ్ అయి  టెలికాస్ట్ అయితే మంచి టీఆర్పీ రేటింగ్స్ ను అందుకోవ‌డం. వీటి త‌రువాత మ‌ళ్లీ సొంత బ్యాన‌ర్ యూవీ క్రియేష‌న్స్ పై
త‌న స్నేహితులను (వంశీ, ప్ర‌మోద్) నిర్మాత‌లుగా, రైట‌ర్ కొర‌టాల శివ‌ను డైర‌క్ట‌ర్ గా ప‌రిచయం చేసి మిర్చి సినిమా చేశాడు. పెద్ద హిట్ కొట్టాడు. మిర్చి త‌రువాత ఆయ‌న కెరియ‌ర్ మ‌ళ్లీ రాజ‌మౌళీ కాంపౌండ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆగింది. బాహుబ‌లి సినిమాతో  గొప్ప
విజ‌య దుందుభి మోగించి రికార్డుల మోత మోగించి దాదాపు ఐదేళ్ల క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం అందుకుని పెద్ద‌నాన్న‌కూ, అభిమానుల‌కూ ఆనందానుభూతిని మిగిల్చాడు. ఇట్స్ ఏ ట్రెమండ‌స్ అండ్ మార్వ్‌లెస్ హిట్ ..

మరింత సమాచారం తెలుసుకోండి: