టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగేశ్వ‌ర రావు మ‌న‌వ‌డిగా..మ‌న్మ‌థుడు నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన్ప‌టికీ అఖిల్ ఇప్ప‌టి వ‌ర‌కూ క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్ట‌లేద‌నేది ఒప్పుకోవాల్సిందే. రీసెంట్ గా బ‌డా బ్యాన‌ర్ గీతా ఆర్స్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమాకు కూడా మిశ్ర‌మ స్పంద‌నే వ‌స్తుంది. అయితే చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి అఖిల్ తో ఓ సినిమాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పోస్ట‌ర్ ను విడుద‌ల చేయ‌గా అఖిల్ ఏ సినిమాకూ రానంత క్రేజ్ సురేంద‌ర్ రెడ్డి సినిమా పోస్ట‌ర్ కు వ‌చ్చింది. 

అంతే కాకుండా సినిమా టైటిల్ కూడా ఎంతో ఆస‌క్తిక‌రంగా ఏజెంట్ అనే పేరుతో ఉండ‌టంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే అఖిల్ హీరోగా వ‌స్తున్న ఈ ఏజెంట్ పై తాజాగా ఫిల్మ్ న‌గ‌ర్ లో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి. వాటిలో ఒక‌టి....ఏజెంట్ సినిమాలో అఖిల్ సీక్రెంట్ ఏజెంట్ గా క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను అలరించ‌నున్నాడ‌ట‌. అంతే కాకుండా ఈ సినిమాలో మ‌ల‌యాల సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి విల‌న్ గా న‌టించ‌బోతున్నార‌నేది టాక్.

అయితే ఇందులో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో తెలియ‌దు కానీ మ‌మ్ముటి మాత్రం తెలుగులో చాలా త‌క్క‌వ సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అలరించారు. కానీ ఏజెంట్ ను కూడా పాన్ ఇత‌ర భాష‌ల్లో విడుద‌ల చేస్తున్న నేప‌థ్యంలో మ‌మ్ముట్టి ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఇత‌ర ఇండ‌స్ట్రీల నటులు హ‌ల్చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉప్పెన‌లో వైష్ణ‌వ్ తేజ్ కు విలన్ గా విజ‌య్ సేతుప‌తి....పుష్ప‌లో లో బ‌న్నీకి విల‌న్ గా ఫ‌హ‌ద్ ఫ‌జిల్..న‌టిస్తుండ‌గా ఇప్పుడు మమ్ముట్టి పేరు కూడా వినిపిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: