అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అఖిల్ కి తన కెరీర్ లో మొదటి విజయాన్ని అందించింది అన్న విషయం తెలిసిందే. లవ్ అండ్ కామెడీ  నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు తరువాత చివరికి దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి రోజు నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది దూసుకుపోతుంది  ఈ సినిమా.



 ఎన్నో రోజులనుంచి సరైన విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్న అఖిల్కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి హిట్ లభించిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా హిట్ అవ్వడం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా ఎంతో కీలకంగానే మారిపోయింది. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలోని బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసాయ్. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది అని చెప్పాలి.



 ఎనిమిది రోజులలో ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే..

Nizam: 7.07Cr
Ceeded: 3.75Cr
UA: 2.18Cr
East: 1.11Cr
West: 90L
Guntur: 1.27Cr
Krishna: 1.00Cr
Nellore: 76L
AP-TG Total:- 18.04CR(29.72CR Gross)
Ka+ROI: 1.36Cr
OS – 2.26Cr
Total WW: 21.66CR(36.10CR~ Gross) ఇలా ఉన్నాయి.

 ఇక ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను దాటేసింది. ఇక ఇప్పుడు ప్రాఫిట్ లో దూసుకుపోతుంది.

అయితే ఇప్పటికే అఖిల్ ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అన్నీ ఫ్లాప్ లను చవి చూశాడు. ఇక ఇప్పుడు చివరికి హిట్ కొట్టాడు  దీంతో అఖిల్ కెరియర్  ట్రాక్ లో పడింది అని అంటున్నారు విశ్లేషకులు.  అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Meb