'బాహుబలి'గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ తెరపైకి రావడానికి ముందు సౌత్ నుండి పాన్-ఇండియన్ హీరో అవుతాడని ఎవరూ కనీసం ఊహించలేదు. అప్పటికే సూపర్ స్టార్ అనగానే సౌత్ లో రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు మాత్రమే గుర్తొస్తారు. కానీ వారు తమ కంఫర్ట్ జోన్‌లలో సంతోషంగా ఉన్నారు. ఒకవేళ వారు దాని నుంచి బయటకు వచ్చే ధైర్యం చేసినా కూడా వారు కేవలం హిందీలో అతిథి పాత్రల్లోనే మెరిసేవారు. కానీ ప్రభాస్ ఆ పద్ధతిని పూర్తిగా మార్చేశాడు. బాహుబలి తర్వాత దాని సీక్వెల్, ఆ తర్వాత 'సాహో'తో భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్రను వేసి సౌత్ సత్తాను చాటాడు. అంతేకాకుండా మిగతా హీరోలకూ పాన్ ఇండియా సినిమాల్లో నటించే ధైర్యాన్ని ఇచ్చాడు.

ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. భీమవరంలోని మొగల్తూరులో జన్మించిన ప్రభాస్ హైదరాబాద్ నలంద కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత విశాఖపట్నంలోని సత్యానంద ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందే ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ కొరియోగ్రాఫర్ దగ్గర డ్యాన్స్ నేర్చున్నాడు. ఆ పాపులర్ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు శేఖర్ మాస్టర్. అవును మనం బుల్లితెరపై పలు షోలకు ఆయన జడ్జిగా వ్యవహరించడం చూస్తూనే ఉంటాము. శేఖర్ మాస్టర్ ప్రభాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆయన డ్యాన్స్ గురుగా ఉన్నారు. శేఖర్ మాస్టర్ ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్, బన్నీ వంటి స్టార్ హీరోలకు సైతం కొరియోగ్రాఫర్ గా చేశారు. అయితే ప్రభాస్ కు సినిమాల్లోకి రాకముందే డ్యాన్స్ నేర్పించింది శేఖర్ మాస్టర్ అన్న విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం ప్రభాస్ దాదాపు నాలుగు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: