బుల్లితెర పై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కౌశిక్. ఇక ఈయన పాపులారిటీ గురించి మనకు తెలిసిన విషయమే. ఇక ఎంతో మంది దర్శక నిర్మాతలను కలిసినప్పటికీ ఏ ఒక్కరు కూడా తనకి అవకాశం ఇవ్వలేదని కౌశిక్ తెలియజేశారు. తను పెద్ద సినిమాలలో బాగా యాక్ట్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతోనే సినిమాల నుంచి తొలగించారని చెప్పుకొచ్చాడు కౌశిక్.

ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా  త్రివిక్రమ్ కు కిట్టుగాడు అనే నాటిక బాగా ఇష్టమని తెలుపుతూ వచ్చాడు కౌశిక్. తను ఎప్పుడు త్రివిక్రమ్ ని ఆఫర్లు ఇవ్వమని అడగలేదని చెప్పుకొచ్చాడు. తనలా టాలెంట్ ఉండి ఎంతో మంది డైరెక్టర్లు, నటీనటులు పైకి రాలేకపోయారని కౌశిక్ తెలియజేశారు.


త్రివిక్రమ్ ని ఏదైనా వేషం ఉంటే  ఇవ్వమని నిర్మొహమాటంగా అడగేవాడినని చెప్పుకొచ్చాడు కౌశిక్. ఇక నేను బుల్లితెరపై ఇంత మంచి పేరు సంపాదించి ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాను అంటే , అది దేవుడి దయ అని చెప్పుకొచ్చాడు ఈ నటుడు. ఇక తాజాగా మరొక నటుడు రావు రమేష్ గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశాడు. రావు రమేష్ గొప్ప నటులలో ఒకరు అని చెప్పుకొచ్చాడు కౌశిక్.

రావు రమేష్ కు నటుడిగా ఎదగడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని. అందుకు కారణం ఆయన గొప్ప నటుడు కావడం చేతనే అని తెలియజేశాడు. ఆయన గొప్ప నటుడే కాదు గొప్ప మనిషి కూడా అంటూ చెప్పుకొచ్చాడు. రావు రమేష్ కూడా నాకు బాగా తెలుసు. ఆయన బుల్లి తెరపై నటించేటప్పుడు ఎంతో కసితో తో నటించేవారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎప్పుడు ఏ పాత్ర చేసినా మనం ఫీలవకుండా చేయాలని చెప్పుకు వచ్చేవారని.. కౌశిక్ తెలియజేశాడు.

కౌశిక్ తండ్రికి బాబుగారంటే అమితమైన ప్రేమ ఉండేదని కౌశిక్ తెలియజేశాడు. తన తండ్రిని కూడా ఎదగని ఇవ్వలేదని కౌశిక్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: