చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మెగాఫ్యాన్స్‌కి సూపర్ ఎనర్జీ వస్తుంది. 'మగధీర, బ్రూస్‌ లీ' సినిమాల్లో చిరంజీవి స్పెషల్‌ రోల్‌లో కనిపించినప్పుడు థియేటర్లు హంగామా చేశాయి. ఇక ఈ జోష్‌ని మరింత పెంచడానికి చిరంజీవి, రామ్ చరణ్‌ ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌లో 'ఆచార్య' సినిమా చేశారు. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీలో చిరు, చరణ్‌ ఇద్దరూ నక్సలైట్‌లుగా నటించారు.

కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వస్తోన్న 'బంగార్రాజు'లో నాగార్జున, నాగచైతన్య ఇద్దరూ హీరోలుగా నటిస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతోంది. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో 'ఘోస్ట్' అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ క్యామియో రోల్‌ ప్లే చేస్తాడనే టాక్ వస్తోంది.

ఊహల్లో ఉన్న ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు బాలయ్య. 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999'తో మోక్షజ్ఞని లాంచ్‌ చేస్తానని చెప్పాడు. ఇక ఈ మూవీలో బాలయ్య, మోక్షజ్ఞ ఇద్దరూ హీరోలుగా చేయబోతున్నారు. ఫ్యూచర్‌ స్టార్స్‌గా బోల్డంత పాపులారిటీ ఉన్న గౌతమ్, సితారల్లో గౌతమ్‌ ఆల్రెడీ స్క్రీన్‌పై మెరిశాడు. మహేశ్ బాబుతో కలిసి 'వన్‌ నేనొక్కడినే' సినిమాలో నటించాడు గౌతమ్.

హీరో, సపోర్టింగ్‌ రోల్స్‌ అనే తేడా లేకుండా తెలుగు నుంచి హిందీ వరకు రకరకాల క్యారెక్టర్స్‌ ప్లే చేస్తున్నాడు రానా. డిఫరెంట్‌ జానర్స్‌తో జర్నీ చేస్తోన్న రానా, రీసెంట్‌గానే చిన్నాన్న వెంకటేశ్‌తో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్‌ సీరీస్‌కి సైన్ చేశాడు. ఇక ఇంతకుముందు వెంకటేశ్, రానా ఇద్దరూ కలిసి 'కృష్ణమ్ వందే జగద్గురుమ్' సాంగ్‌లో స్టెప్పులేశారు.

తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి హీరోలుగా సినిమాలు చేస్తున్నారంటే ఆటోమెటిక్‌గానే బజ్‌ పెరుగుతుంది. ప్రీరిలీజ్ బిజినెస్‌లో బెంచ్‌ మార్క్స్‌ సెట్ అవుతాయి. ఓపెనింగ్స్‌ కూడా భారీగా ఉంటాయి. ఈ మార్కెట్‌ తండ్రీ కొడుకుల కాంబోలో సినిమాలు రావడానికి ఈ మార్కెట్‌ లెక్కలు కూడా ఓ కారణమని చెప్పొచ్చు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: