పాన్ ఇండియా హీరో ప్రభాస్ "సాహో" సినిమా రిలీజ్ అయ్యి మూడేళ్లు అవుతోంది. అంటే గత మూడేళ్లుగా ప్రభాస్ నెక్స్ట్ మూవీ రా"దే శ్యామ్" కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇన్నేళ్లు గడుస్తున్నా ఈ సినిమా కథపై ఓ క్లారిటీ మాత్రం రాలేదు. అందులోనూ విక్రమాదిత్య ఎవరు అన్న విషయం బయట పడలేదు. అయితే నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాదే శ్యామ్ మూవీ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. టీజర్, పోస్టర్లు అనేవి సినిమా ప్రమోషన్స్ లో ఒక భాగం. ఇవి సినిమాపై అంచనాలను పెంచుతాయని విషయం తెలిసిందే. కాగా నేడు విడుదలైన "రాదే శ్యామ్" టీజర్ చూస్తుంటే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదనే అనిపిస్తోంది.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రంపై ఇపుడు టీజర్ తరవాత పాజిటివ్ టాక్ తో పాటు పలు రకాల నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. టీజర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆడియన్స్ చాలామంది నిరాశ చెందారని చెప్పాలి. ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కారణంగా హీరోయిన్ , హీరోకి మధ్య సన్నివేశాన్ని అలాగే భారీ యాక్షన్ సన్నివేశాన్ని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. పెద్ద సర్ప్రైజ్ లభిస్తుందని అనుకున్నారు కానీ...టీజర్ మాత్రం చాలా సాదా సీదాగా అనిపించింది. అందులోనూ టీజర్ లో ప్రభాస్ అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడటం ఒక్క ముక్క కూడా తెలుగు వినిపించకపోవడంతో మరింత నిరాశ చెందారు. కొందరు నెటిజన్లు అయితే ఇది తెలుగు మూవీనా లేక ఇంగ్లీష్ మూవీనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు "సాహొ 2" అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి అదే నోటితో అదుర్స్ అంటూ విజిల్స్ వేస్తారంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి టీజర్ మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచడంలో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదనే చెప్పాలి. ఎంత పాన్ ఇండియా మూవీ అయినా తెలుగు టీజర్ అన్నప్పుడు తెలుగులో సంభాషణ ఉండి ఉంటే ఆసక్తికరంగా ఉండేది. ప్రభాస్ డైలాగ్స్ ను విని ప్రేక్షకులు అట్రాక్ట్ అయి ఉండేవారు అని కొందరి అభిప్రాయం. ఇక ఇపుడు ఈ సినిమా తదుపరి ట్రైలర్ పై ఉత్కంఠ నెలకొంది. టీజర్ ను దృష్టిలో పెట్టుకొని ట్రైలర్ ను ప్రేక్షకుల  అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రూపొందిస్తారని అంతా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: