సాధారణంగా కొన్ని కొన్ని సినిమాలు దర్శకుల ఆలోచనలకు రూపం దాలిస్తే, మరికొన్ని కథలు ఏకంగా నిజ జీవితంలో జరిగినవే మన కళ్ళముందు కదులుతూ ఉంటాయి. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూర్య ఏ సినిమాలో నటించినా.. ఆ సినిమాతో తప్పకుండా ఏదో ఒక సరికొత్త మెసేజ్ ను ప్రేక్షకులైతే అందిస్తూ ఉంటాడు. అందులో భాగంగా వచ్చిన సినిమానే ఆకాశం నీ హద్దురా.. ఈ సినిమాలో సామాన్యుడు విమానం ఎక్కలేక.. విమానం ప్రయాణం అంటే కేవలం ధనికులకు మాత్రమే సొంతం అని అనుకునే వారందరికీ, కేవలం ఒక్క రూపాయి టికెట్లతో విమానంలో అందర్నీ ప్రయాణం చేసే, ఒక ప్రముఖ పైలెట్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.


ప్రముఖ దర్శక రచయిత అయిన సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు టాలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు ఈ సినిమాలో హీరో కూడా సూర్యనే.. ఇక హీరోయిన్ గా అపర్ణ తనదైన శైలిలో నటించి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇందులో ప్రధాన పాత్రల్లో పరేష్ రావల్, ఊర్వశి ,బాలమురళి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.. ఇక ఈ సినిమాకు  జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా పనిచేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో " కాటుక కనులే " అనే  పాట విడుదలైన మొదటి రోజు నుంచి మంచి ప్రేక్షకాదరణ పొందింది.


2020 నవంబర్ 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈ సినిమా 2019 ఏప్రిల్ 13 వ తేదీన విడుదలైన సూరారాయ్ పొట్రు అనే తమిళ సినిమా నుంచి తెలుగులో డబ్బింగ్ చేయడం జరిగింది. ఇక తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యి మొత్తం దేశం అంతటా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. అంతే కాదు ఇందులో ఉండే ప్రధాన సాంకేతిక అంశాలను విమర్శకులు కూడా ప్రసంసించారు. అలాగే 78 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగం  కింద ప్రదర్శించబడే 10 భారతీయ చిత్రాలలో ఆకాశం నీ హద్దురా సినిమా కూడా ఎంపిక కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: