అయితే ఈ మధ్య సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు దుమారం రేపాయి. కానీ అవన్నీ సుమంత్ నూతన చిత్రం "మళ్ళీ మొదలైంది" అనే మూవీ వల్ల పుట్టుకొచ్చిన గాసిప్స్ అని రివీల్ అయింది. గతంలోనూ ఛార్మి, కమలినీ ముఖర్జీ ఈ ఇద్దరి హీరోయిన్లతో సుమంత్ ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఛార్మితో గౌరి సినిమా తీస్తున్నప్పుడు సుమంత్ ఛార్మి ల మధ్య ఏదో ఉందని అంతా గుసగుసలాడారు, ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. ఆ తరవాత మళ్లీ గపచిప్ అయిపోయాయి. అలాగే కమలినీ ముఖర్జీతో గోదావరి సినిమా తీస్తున్నప్పుడు సుమంత్ ఈ హీరోయిన్ ప్రేమలో పడ్డారని తెరలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు రకరకాల వార్తలు వినిపించాయి.
కానీ కొన్నాళ్ళకి అవి కూడా అటకెక్కాయి.ఈ ఇరువురితో సినిమాలు తీసిన తరువాత ఇలాంటి వార్తలు బయటకు రావడం సహజమే అని ఆయన ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు. కానీ సుమంత్ ఇప్పటికైనా ఓ ఇంటివాడు అయ్యి తనకంటూ ఒక కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నారు అభిమానులు. కానీ అప్పట్లో అవి నిజామాయినా బాగుండేదని ఫ్యాన్స్ అనుకున్నారు. మరి సుమంత్ ఈ ఏడాదైనా శుభవార్త చెబుతారేమో చూడాలి...