ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఎలాంటి సినిమాలను  ఎంచుకుని హిట్ సాధించాలో ఆయనకు బాగానే తెలుసు. అయితే మంచి సినిమా ను ఎంచుకుని మంచి దర్శకుడి తో షూటింగ్ పూర్తి చేసుకొని మంచి తారాగణంతో తెరకెక్కించి ఆయా సినిమాలను రెడీ చేసుకోవడంతో పాటు ఏ సమయంలో ఆ సినిమాలను విడుదల చేస్తే అవి బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుతాయి. ఇండస్ట్రీ హిట్ సినిమాలు గా మారుతాయి అనేది ఆయన ఒక్కడికే తెలుసు. ఆ విధంగా ఆయన నిర్మాణ సారధ్యంలో వచ్చిన సినిమా లు ఎక్కువగా హిట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు ఆయన నిర్మాత వా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా f3 చిత్రం. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరో లుగా తెరకెక్కిన ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలైన f2 ఈ సినిమాకి సీక్వెల్. చాలా ఏళ్ళ తర్వాత వెంకటేష్ లోని కామెడీ టైమింగ్ ను బయటికి తీసుకు వచ్చిన ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ కు కూడా బాగా ఉపయోగపడింది.  130 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెట్టిన ఈ సినిమా సీక్వెల్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని భావిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ఖరారు అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చినా ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ప్రకటన వచ్చింది. 2022 ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించింది యూనిట్.  సంక్రాంతి కి ఇతర పెద్ద సినిమా లు ఉండడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అవక తప్పలేదు.  తమన్నా, మేహరీన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి f2 చిత్రం కంటే మరింత హిలేరిలియస్ గా ఉండేలా రూపొందించటం 

మరింత సమాచారం తెలుసుకోండి: