అనుష్క..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అందంతో ,అభినయంతో,నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న బ్యూటీ. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ అనే చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..ఆ తరువాత వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ వెళ్లింది. ఫలితంగా కెరీర్ లో వరుస ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఆ తరువాత వచ్చిన లేడీ ఒరియంటేడ్ చిత్రం " అరుంధతి" తో తనకంటూ టాలీవుడ్ లో ఓ స్పేషల్  ఇమేజ్  క్రియేట్ చేసుకుంది. అటు గ్లామరస్ పాత్రలు.. ఇటు హోంలీ రోల్స్ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ..ఆల్ రౌండర్ అనిపించుకుంది. ఇక బాహుబలి లో దేవసేన గా ప్రాణం పెట్టి జీవించేసిందనే చెప్పాలి. అయితే సినిమాల పరంగా ఎలా ఉన్నా..ఈమె మాత్రం పెళ్లి విషయంలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.

ఇప్పటికే 40కి చేరువైన ఈ భామ పెళ్లి మాట ఎత్తితే కస్సుమంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎవర్ ట్రేండింగ్ మ్యాటర్ ఏదైన ఉంది అంటే అది ప్రభాస్ అనుష్క పెళ్లి మ్యాటర్. మా మధ్య అలాంటిది ఏం లేదురా బాబోయ్ అంటున్న..లేదు లేదు మీ మధ్య లవ్ ఉంది అంటూ గాసిప్ రాయళ్లు వీళ్ల గురించి తెగ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఆరు అడుగుల బ్యూటీ..అక్కినేని ఇంటికి కోడలు  కాబోతుందట. అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుండి లీకైన సమాచారం మేరకు  అక్కినేని నాగేశ్వర రావు మనవుడిని అనుష్క పెళ్లి చేసుకోబోతుందట. ఇక నాగార్జున కి అనుష్క కి మధ్య ఉన్న ఫ్రేండ్  షిప్ గురించి మనకు తెలిసిందే. ఈ క్రమంలో అనుష్క అక్కినేని ఇంటి కోడలు అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు సినీ పండితులు.. మరి చూడాలి ఈ విషయం పై అటు స్వీటీ..లేదా ఇటు అక్కినేని ఫ్యామిలీ ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి: