భారత దేశంలో ఉత్తరాన వున్న హిమాలయాలని దర్శించటం ఎంతో పవిత్రంగా భావిస్తుంటారట మన హిందువులు. ఎంతో మంది తమ జీవితంలో ఒకసారైనా హిమాలయాలని సందర్శించిలని అనుకుంటారని తెలుస్తుంది 

మన పురాణాల్లోను హిమాలయాల ప్రాశస్త్యం మరియు ప్రాముఖ్యత అలాగే గొప్పదనం గురించి ఎంతో గొప్ప విషయాలు దాగి ఉన్నాయని తెలుస్తుంది.. సాక్షాత్తు దేవుళ్ళు కొలువై ఉండే ప్రదేశంగా నమ్మే ఆ ప్రాంత రహస్యాలు మరియు అద్భుతాలు ఇప్పటివరకు మానవాళి ఛేదించలేదని తెలుస్తుంది.. ఈ క్రమంలో హిమాలయ అద్భుతాన్ని దర్శించుకున్న సమంత తాజాగా తన అనుభవాలని మరియు అనుభూతులని పంచుకుందని సమాచారం.. తన ప్రాణ స్నేహితురాలు అయిన శిల్పారెడ్డితో కలిసి ఛార్ ధామ్ యాత్ర చేశానని.. ఎంతో అద్భుత రీతిలో తన పర్యటన ముగిసినట్లు తన యాత్ర విశేషాలని సోషల్ మీడియా వేదికలో ఫ్యాన్స్ తో సమంత పంచుకుందని సమాచారం.

 

ఛార్ ధామ్ యాత్ర ముగించుకున్న సమంత మాట్లాడుతూ.. ‘ ఈ భూమి మీద స్వర్గధామమైన ప్రదేశం దేవుళ్ళు కొలువుండే హిమాయలని సందర్శించాలని అనుకున్నానని మహాభారతం చదివినప్పటి నుండి నాకు ఈ యాత్ర చేయాలనీ కోరిక అని ఇక్కడి అద్భుతాలు మరియు రహస్యాలను ప్రత్యేకంగా సందర్శించాలన్న నా కల ఇప్పటికి నెరవేరిందని చెప్పుకొచ్చిందట దేవుడి మీదుండే నమ్మకం మరియు వాస్తవికత మధ్య ఉండే ఉత్కంఠత ఎప్పుడు ప్రత్యేకమైందని తెలుస్తుంది.అదెప్పుడూ ఉత్కంఠభరితమైనదేనని నా హృదయంలో ఈ హిమాలయ పర్వతాలకి మరిచిపోలేని స్తానం ఉంటుందని నా స్నేహితురాలు శిల్పా రెడ్డితో ఈ ప్రయాణం సాగించడం కూడా నాకు మరింత ప్రత్యేకం ‘ అంటూ సమంత తన అనుభూతులని పంచుకుందని తెలుస్తుంది.. ఇక యమునోత్రి పుట్టుక మరియి ప్రవాహం అలాగే చరిత్ర గురించి వివరించిందట సమంత. ఆ ప్రదేశంలోని జంతువులని కూడా సామ్ ప్రత్యేకంగా చూపెట్టినట్లు తెలుస్తుంది.. ఏదేమైనా విడాకుల తరువాత తన స్నేహితురాలితో కలిసి పుణ్యక్షేత్రాలని సందర్శించిన సమంత అక్కడ పూజలు హోమాలు తలపెట్టి ఎంతో సంతోషంగా ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: