శర్వానంద్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.. తన ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్ లాగే స్టార్ రేంజికి ఎదిగి పోవాలని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ, అదృష్టం కలిసిరాక చిన్నాచితకా సినిమాలకే పరిమితమవుతున్నారు. ఎలాగైనా సరే మంచి విజయాన్ని సాధించాలని మరో హీరో సిద్ధార్థ్ తో కలిసి మహా సముద్రం అనే సినిమాతో మల్టీస్టారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా శర్వానంద్ మాత్రం మళ్లీ నిరాశే మిగిలిందని చెప్పాలి.. అయితే శర్వానంద్ ఒకపక్క నిర్మాణ సంస్థను నడుపుతున్న విషయం కూడా తెలిసిందే..


అయితే సినిమాలలో హీరోగా రాణించాలని ఎంత ప్రయత్నం చేసినా, శర్వానంద్ కు మాత్రం కలిసి రావడం లేదు. ఇక శర్వానంద్, రామ్ చరణ్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.. విద్యాభ్యాసం మొత్తం కలిసి చదువుకున్నారు. కానీ ఈవీవీ సత్యనారాయణ కొడుకులైన అల్లరి నరేష్ , ఆర్యన్ రాజేష్ ల సహకారంతోనే సినీ ఇండస్ట్రీలోకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఒక సినిమా ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టాడు శర్వానంద్..

మంచి యాక్టింగ్, హీరో కట్ అవుట్.. ఇతన్ని చూసి ప్రేక్షకులు అప్పట్లోనే మంత్ర ముగ్ధులు అయ్యారు. కానీ ఇతను ఎంచుకొనే కథలు  ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి.. ఇక శర్వానంద్ తో సహా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతో మంది నటులు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలకి కూడా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే.. కానీ శర్వానంద్ మాత్రం ఇప్పటివరకు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడడం లేదు.. కనీసం ఇప్పటి వరకు కూడా ఏ అమ్మాయి తో ఎఫైర్ ఉన్న దాఖలాలు లేవు.. ఇకపోతే శర్వానంద్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

35 సంవత్సరాల పైబడినా కూడా శర్వానంద్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం వెనుక ఎన్నో అర్ధాలు వెతుకుతున్నారు నెటిజన్లు.. శర్వానంద్ కనీసం ఇప్పటికైనా వివాహం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తుంటుంటే..ఈయన మాత్రం ఒక మంచి విజయం సాధించే వరకు పెళ్లి చేసుకోనని బీష్మించుకు కూర్చున్నాడట శర్వానంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: