ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి అనే ఊసెత్తగానే అప్పుడేనా అంటూ మొహం చాటేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు దాదాపు 30 సంవత్సరాలు..కాదు 40 సంవత్సరాలు లోకి అడుగుపెడుతున్నా కూడా పెళ్లి అనగానే ఇంకా సమయం ఉంది అంటూ చెప్పడం గమనార్హం. అయితే ఇదే బాటలో ని కొంతమంది తమకు ఇష్టమైన వాళ్లను ప్రేమించి, వాళ్ళు మోసం చేయడంతో తిరిగి పెళ్లి అనే విషయానికి కూడా దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేయాలని చూస్తున్నారు.

ఇకపోతే మన ముద్దుల గుమ్మా అందాల తార లావణ్య త్రిపాఠి కూడా ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పై తన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 1990 డిసెంబర్ 15వ తేదీన జన్మించిన లావణ్య త్రిపాటి ప్రస్తుతం 30 సంవత్సరాలు దాటిన ఇంకా పెళ్లి చేసుకోలేదు. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఒక మోడల్ గా తన జీవితాన్ని మొదలు పెట్టింది..అంతే కాదు మంచి నర్తకి కూడా. ఇక 2006వ సంవత్సరంలో ఈమె మిస్ ఉత్తరాఖండ్ అనే టైటిల్ ని కూడా గెలుచుకొని , ఆ తర్వాత మోడల్ గా పనిచేయడం ప్రారంభించింది.

2012వ సంవత్సరంలో అందాల రాక్షసి అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈమె వరుణ్ తేజ్ తో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. ఈ వార్తలు మాత్రం రూమర్స్ లాగానే మిగిలిపోయాయి.. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా.. అందుకు తప్పకుండా లావణ్య త్రిపాటి హాజరు కావడంతో.. ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తడంజరిగింది.. కానీ నాగబాబు కూతురు నిహారిక కు లావణ్య త్రిపాఠి కి మధ్య ఉన్న మంచి సాన్నిహిత్యం కారణంగానే ఆమె ప్రతి ఫంక్షన్ కి వెళ్లడానికి కారణం అయింది.. కానీ అప్పటికే లావణ్య త్రిపాటి, వరుణ్ తేజ్ కలిసి నటించారు కాబట్టి ఈ రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం లావణ్య ఒక కేఫ్ ను నిర్వహిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: