ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు గురించి తెలియని వారుండరూ. వ్యాపారవేత్తగా, నిర్మాతగా ఆయా ఇండస్ట్రీల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. అయితే నిర్మాత సురేష్ బాబుకు ముందుచూపు చాలా అధికం. ఆయన ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే.. ఆ సినిమా సక్సెస్ అయ్యేలా ఎంతో ఎఫర్ట్ పెడతారు. సినిమా పూర్తయ్యాకా ఏ సమయానికి విడుదల చేయాలనే విషయంపై ఫుల్ క్లారిటీగా ఉంటారు. ప్రస్తుతం సురేష్ బాబు నిర్మాణంలో దృశ్యం-2, విరాటపర్వం సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అయితే దృశ్యం-2, విరాటపర్వం సినిమాలు విడుదల చేసే విషయంలో సురేష్ బాబు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందులో సినిమాను రిలీజ్ చేయాలనే విషయంలో సందిగ్థత నెలకొంది. ఈ సినిమాలను థియేటర్‌లో రిలీజ్ చేయాలా.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం అయిన ఓటీటీలో రిలీజ్ చేయాలా అనే విషయంపై ఆయన ఆలోచిస్తున్నారు. రిలీజ్‌కు సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నిర్మాత సురేష్ బాబు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలను రిలీజ్ చేసే విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు బాగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలో రిలీజ్ చేసేందుకే మక్కువ చూపుతున్నారు. కరోనా రాకముందు దర్శకనిర్మాతలు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపేవారు. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో ఓటీటీలో విడుదలయ్యేవి. కానీ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. థియేటర్లలో విడుదలై హిట్ అయిన సినిమాలు కూడా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.
 
దీనికి కారణం ఆయా స్ట్రీమింగ్ సంస్థలు భారీ మొత్తంలో డీల్స్ మాట్లాడుకోవడమే. దృశ్యం-2, విరాటపర్వం సినిమాలను కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. కానీ ఇటీవల విడుదలైన లవ్‌స్టోరీ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సురేష్ బాబు థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఓటీటీ సంస్థలు మరింత మంచి డీల్స్ ఆఫర్ చేసింది. దీంతో ఈ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయాలనే తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా.. రిలీజ్ డైట్స్ కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: