లోక నాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి తగ్గ కూతురిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శృతి హసన్ కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్య నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత ఆమెకి సంగీతపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో శ్రద్ద చూపించింది. అయితే ఆమె 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన తొలిసారి హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా పరాజయాన్ని అందుకోవడంతో హీరోయిన్ ఆమె కెరీర్ ప్రారంభంలో అనేక విమర్శలు అందుకున్నారు.

ఇక 2011లో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాలో శృతి తన నటనకు ప్రశంసలు అందుకున్న సినిమా మాత్రం హిట్ అందుకోలేకపోయింది. సూర్య సరసన నటించిన సెవెంత్ సెన్స్ సినిమా ఆమెకి మంచి విజయాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాకి తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును కైవసం చేసుకుంది. అలాగే సిద్ధార్థ్ సరసన ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శృతిహాసన్ మంచి స్టార్ డాం ని తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత ఆమె స్థాయి మారిపోయింది. అంతేకాదు.. ఈ సినిమా తరువాత ఆమె వరుస సినిమా అవకాశాలను అందుకొని రవితేజ సరసన "బలుపు", జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన "రామయ్యా వస్తావయ్యా వంటి సినిమాలో నటించింది. ఇక రవితేజ సరసన నటించిన క్రాక్ సినిమాతో విమర్శలు అందుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ తన ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తుంది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: