తెలుగు బుల్లితెర బ్లాక్ బ‌స్టర్ సీరియల్ కార్తీక దీపంకు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తెలుగు బుల్లి తెర‌పై ఎన్నో టీవీ ఛానెల్స్‌.. మ‌రెన్నో ఎంట‌ర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ర‌న్ చేస్తున్నాయి. ఎంతో మంది హాట్ యాంక‌ర్ల‌ను దింపి ఏవేవో బూతు డైలాగులు ప‌లికి స్తున్నాయి. ఇలా ఎన్ని ప్రోగ్రామ్స్ వ‌చ్చినా కూడా కార్తీక దీపం దరి దాపుల‌కు కూడా రావ‌డం లేదు. ప్ర‌తి రోజు రాత్రి 7.30 గంట‌లు అయ్యిందంటే చాలు తెలుగు ఆడ‌ప‌డుచు లే కాదు.. పురుషులు కూడా కార్తీక దీపం సీరియ‌ల్ కు అతుక్కు పోయి క‌న్నార్ప కుండా చూస్తున్నారు.

ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న మోనిత‌ క్యారెక్టర్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. వాస్తవంగా చూస్తే మౌనిక కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి. అయితే ఆమె అచ్చ తెలుగు అమ్మాయిలా న‌టిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ లో విలన్ గా మోనిత వేసిన క్యారెక్టర్ బాగా పాపులర్ అయ్యింది. సీరియల్ లో చాలా క్యారెక్ట‌ర్ లు ఉన్నాయి. ఎన్ని క్యారెక్ట‌ర్లు ఉన్నా కూడా ఆమె క్యారెక్ట‌ర్ టాప్‌ హైలెట్. ఆమె లేకపోతే కధలో ట్వీస్ట్ లు ఉండవ‌నే చెప్పాలి.

త్వరలోనే మౌనిత పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన మోనిత‌ కన్నడ ఇండస్ట్రీలో ఓ టాప్ సీరియల్ హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడితో ప్రేమలో ఉన్న మోనిత‌ వచ్చే ఏడాది అతడితో మూడు ముళ్ళు వేయించుకోనుంద‌ట‌. ఆమె తెలుగులో కార్తీక దీపం సీరియల్ తో పాటు కన్నడంలో కూడా ప‌లు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెరపై బిజీ హీరోయిన్గా గుర్తింపు పొందింది.

ఇక ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసే వీడియోలకు గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వస్తూ ఉంటాయి. ఇక‌ ఆమెకు సోషల్ మీడియాలో కూడా తిరుగులేని పాపులారిటీ ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: