టాలీవుడ్ లో హీరోలకు కొదువ లేదు. ఎంతో మంది టాలెంట్ ఉన్న హీరోలు తెలుగు ప్రేక్షకులను అద్భుతంగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. వారి సినిమాలు చూసి స్ఫూర్తి పొందినవారు అనేకం. వారి సినిమాలలో వారు ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా చేయడానికి ఫ్యాన్స్ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా చాలా మంది సినిమాల నుండి మంచిని మాత్రమే తీసుకుని లైఫ్ లో సెటిల్ అవుతుంటే, అతి కొద్ది మంది మాత్రమే చెడును తీసుకుని వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అటువంటి హీరోలు ఎన్నో కష్టాలు పడి సినిమాలలో నటించి మనకు సంతోషాన్ని కలిగిస్తారు. కానీ వారు మాత్రం వారి లైఫ్ లో సంతోషంగా ఉన్నారా? అంటే లేరనే చెప్పాలి.

సంతోషం అంటే మనకంటూ ఒక కుటుంబం పిల్లలతో గడుపుతూ ఉంటే అది అసలైన సంతోషం. మనకోసమంటూ ప్రాణమిచ్చే కుటుంబాన్ని కలిగి ఉంటేనే అసలైన తృప్తి. కానీ చాలా మంది టాలీవుడ్ హీరోలు  ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండిపోయారు. అలాంటి వారిలో ఒకరే రామ్ పోతినేని. అయితే ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయాలంటే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. అయితే గత సంవత్సరం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రామ్ చెప్పిన సమాధానం విని మీడియా మిత్రులు అవాక్కయ్యారు.

అసలు రామ్ ఏమి చెప్పాడో తెలుసా, "పెళ్లి అనేది మన చేతుల్లో ఉండదు. కానీ ఇప్పుడు నేను సింగిల్ గా చాలా హ్యాపీగానే ఉన్నాను. అసలు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అనేది దేవుడి చేతిలో ఉంటుందని వేదాంతం చెప్పాడు". దీనిని బట్టి ఇప్పుడల్లా పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని క్లారిటీగా అర్ధమవుతోంది.  మరి చూద్దాం ఎప్పుడు పెళ్లిచేసుకుంటాడో . ఇప్పటికే 34 సంవత్సరాలు వచ్చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: