క‌రోనా దెబ్బ‌తో గ‌త రెండేళ్లుగా టాలీవుడ్ సినీ ప్రియుల‌కు పెద్ద‌గా ఎంజాయ్ మెంట్ లేదు. సినిమాలు రిలీజ్ లేవు.. చాలా మంది థియేట‌ర్ల‌కు వెళ్ల‌డ‌మే మానేశారు. సినిమాలు వ‌చ్చినా క‌రోనా భ‌యంతో ఎవ్వ‌రూ ముందుకు వ‌చ్చి థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం లేదు. థియేట‌ర్లు హౌస్ ఫుల్ కావ‌డం లేదు. దీంతో మాస్ స్టైల్లో ఈల‌లు, కేక‌ల తో సినిమాను ఎంజాయ్ చేసే ప‌రిస్థితి లేదు. పైగా బెనిఫిట్ షో లు, అర్ధ‌రాత్రి షోలు లేక‌పోవ‌డం కూడా పెద్ద దెబ్బే అయ్యింది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత కూడా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాక ఎట్ట‌కేల‌కు ఇప్పుడిప్పుడే థియేట‌ర్లు ఓపెన్ అవుతున్నాయి.

జ‌నాలు కూడా థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే సూప‌ర్ హిట్ చేస్తున్నారు. బ్యాచిల‌ర్ , ల‌వ్ స్టోరీ సినిమాలే ఇందుకు ఉదాహ‌ర‌ణ గా నిలిచాయి. అయితే వ‌చ్చే సంక్రాంతి నుంచి వ‌రుస‌గా మూడు నెల‌ల పాటు టాలీవుడ్ సినీ ల‌వ‌ర్స్ కు ప్ర‌తి సినిమా పెద్ద పండ‌గే కానుంది. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్  టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న థియేట‌ర్ల లోకి దిగుతోంది. ఆ త‌ర్వాత సంక్రాంతి కి భీమ్లా నాయ‌క్ వ‌స్తోంది. ఇక ప్ర‌భాస్ రాధే శ్యామ్ కూడా సంక్రాంతికే వ‌స్తోంది.

ఆ త‌ర్వాత చిరంజీవి ఆచార్య ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్ప‌టికే ప్రకటించారు.  అలాగే  ఎఫ్ 3 సినిమాను అదే ఫిబ్ర‌వ‌రి నెల 24న థియేట‌ర్ల‌లోకి తీసుకు వ‌స్తున్నారు. ఒక వేళ భీమ్లా నాయ‌క్ సంక్రాంతికి రాక‌పోతే మార్చి 31న రిలీజ్ చేస్తార‌ట‌. ఓవ‌రాల్ గా చూస్తే వ‌చ్చే యేడాది జ‌న‌వ‌రి 7 నుంచి స్టార్ట్ అయితే మూడు నెల‌ల పాటు వ‌రుస‌గా పెద్ద హీరోల సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి మామూలుగా లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: