జనాలు కూడా థియేటర్లకు వస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే సూపర్ హిట్ చేస్తున్నారు. బ్యాచిలర్ , లవ్ స్టోరీ సినిమాలే ఇందుకు ఉదాహరణ గా నిలిచాయి. అయితే వచ్చే సంక్రాంతి నుంచి వరుసగా మూడు నెలల పాటు టాలీవుడ్ సినీ లవర్స్ కు ప్రతి సినిమా పెద్ద పండగే కానుంది. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్ల లోకి దిగుతోంది. ఆ తర్వాత సంక్రాంతి కి భీమ్లా నాయక్ వస్తోంది. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ కూడా సంక్రాంతికే వస్తోంది.
ఆ తర్వాత చిరంజీవి ఆచార్య ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఎఫ్ 3 సినిమాను అదే ఫిబ్రవరి నెల 24న థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఒక వేళ భీమ్లా నాయక్ సంక్రాంతికి రాకపోతే మార్చి 31న రిలీజ్ చేస్తారట. ఓవరాల్ గా చూస్తే వచ్చే యేడాది జనవరి 7 నుంచి స్టార్ట్ అయితే మూడు నెలల పాటు వరుసగా పెద్ద హీరోల సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి మామూలుగా లేదనే చెప్పాలి.